[1]గీ. |
గాలివంక గౌలు గని యీరములు చేరి, తారిలాఁగలెల్ల మూరుకొనుచుఁ
గాలు ద్రవ్వి యునికిఁ గని కొమ్ముటుడుములఁ, గఱచి తిగిచెఁ గొన్నిమొఱసడములు.
| 45
|
గీ. |
యమునిగద నిడ్డ లోహఖడ్గమువిధమునఁ, జేతఁదగుతోఁచిగానికిఁ జెమటప్రాఁత
యొత్తుగా ముష్టి నమరించి యొకఁడు వైచెఁ, గట్టెఁబొద సోపి వెలిచె పైగజ్జె గదల.
| 45
|
గీ. |
పొట్టిగుట్టులు గుట్టుగా [2]మట్టిమట్టి, గట్టిపట్టులు ముక్కునఁ గుట్టికుట్టి
యిట్టునట్టును రెట్టలఁ గొట్టికొట్టి, పట్టెఁ గుందేటి నపు డొక్కదిట్టలగుడు.
| 46
|
గీ. |
ఇట్లు తాము నిగ్రహించినమెకముల, నెల్లఁ దెచ్చి యెదుట నిడినఁ జూచి
చంద్రభానుఁ డపుడు చాల మెచ్చి పుళింద, వరుల కొసంగె నుచితవస్తుసమితి.
| 48
|
క. |
అట్టియెడఁ గఱకుమేనులఁ, బుట్టినబడలికలతోడ బోయలు వేఁటల్
మట్టుపఱిచి యాచెంతల, పొట్టెము లగుపొదలఁ జేరి పొదలెడువేడ్కన్.
| 49
|
సీ. |
కొందఱు మునుమున్ను గూలినమెకములఁ గాట్రేని కర్పింపఁ గడఁగి రపుడు
కొందఱు మనుబిళ్లఁ గోసి కుప్పలు వైచి పాలు దప్పకయుండఁ బంచి రపుడు
కొందఱు బలునెల్లికొయ్య నింగలములు గల్పించి కఱకుట్లు గాల్చి రపుడు
కొందఱు తేఁకుటాకుల దొప్పగమిలోనఁ బస గలనంజుడు ల్మెసవి రపుడు
విపినతలమున నీరీతి వేఁటకాండ్రు
సముచితోత్సాహములు మించ శౌరిసుతుఁడు
ఠీవిఁ బురినుండి బోనపుట్టికలు రా ని
జాప్తపరిజనయుతుఁ డయి యారగించె.
| 50
|
చ. |
చలువలు చిందుకందువలఁ జంద్రశిలోపలసాంద్ర[3]వేదికన్
జలజలఁ జాలుగా సెలలు జాఱునొకానొకకోనలోనఁ బా
టల పటుకోరకోదరవిటంకనటత్సవమానకందళుల్
చెలఁగెడు నొక్కపూవుఁబొదఁ జేరి సుఖంబున నుండె నయ్యెడన్.
| 51
|
చంద్రభానునికడకు సిద్ధుఁడు వచ్చుట
సీ. |
ముడివీడుకుఱుచకెంజడలతో నిచ్చొందుకఱపట్టుకుచ్చలిగంతతోడ
వలచేతిజలకమండలువుతోఁ బేరెద నిట్టలం బగుయోగపట్టెతోడఁ
బెఱచేతిబెత్తముమురువుతోఁ గళమునఁ దాల్చినసింగినాదంబుతోడ
[4]మూలికె ల్గలకకపాలతో సందిటఁ గదియు కేదారకంకణముతోడ
|
|
- ↑ ఇదియుఁ గ్రిందిపద్యమును క-లో లేవు.
- ↑ చ-ముట్టిముట్టి
- ↑ చ-ట-సీమలన్
- ↑ క-మాలికల్