పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/43

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నలుగడల నెత్తుకఱిత్రాటివలలు సెలఁగె, నపుడు పటపటహార్భటి నడరి చుక్క
వెండిచీలలు రాలఁ బైనుండ కిలకు, డాసిన సరంధ్రగగనఖండము లనంగ.

31


గీ.

వనవరాహంబు లెదురుగా వని తలంచి,యాదికిటిపతిఁ బట్టుటకై కడంగి
తెరువు లెల్లెడఁ బలువుగఁ దీర్చి రనఁగ, రవ్వ వేఁటరు లోదముల్ ద్రవ్వి రపుడు.

32


వ.

అత్తఱిఁ దండతండంబులై పండి రాలినచింతపండు మెసవినకతంబున మెం
డుకొనుకండక్రొవ్వులు దండిపేరెండలఁ గరంగి పడియఁ బడియపట్లకు వచ్చి
యచ్చట నీరు గానక ఘోరఘర్ఘరధ్వానంబులు గర్జితంబులును నెత్తురు లొ
లుకుతత్తరంపుఁజూపులు దటిత్తులును నాస్యగళత్ఫేనఖండంబులు కరకలును
గాఁ గఱకునెఱి మెఱుంగు దొరయునురవడి ధరియింపలేక ధరణివివరంబుఁ
జొరఁబూను ఘనంబు లగుఘనాఘనాఘనంబులకరణి ఖనిత్రక్రూరపోత్రకోటికల వీ
టికలు వడినవండుపెల్ల లెగనెత్తి యుల్లన నూరుచిలుపచిలుపకలఁకనీట నా
లుకలు తడుపు [1]సూకనికరంబులకు నావాసదేశంబు లగునెడ నలుదిక్కులఁ జు
ట్టువలలు గట్ట నియమించియు మఱియు దట్టంబుగాఁ బుట్టిన పొట్టచిచ్చు
మట్టుపెట్టుటకునై పుట్టలకుఁ జేరి దట్టంబు లగుఖరనఖరధట్టంబుల నట్టిట్టు
త్రవ్వి నెఱుసు లేఱుతెఱంగున నభంగఫూత్కారభీషణభుజంగంబులఁ దివి
చివైచి మధుచ్ఛత్రాకావిభ క్తంబులగు తదీయభక్తంబులు బుగ్గలకు నగ్గలం
బుగా మెసవి బుసకొట్టుచు నుసురుకొనునన్నునఁ గన్నుఁ గానక నిజనిలయ
నికుంజవలయంబుల నిదురించుతఱి సురసురఁ దిరుగు సురకరువలిపరువులఁ
దరువుల రవులు నెరగలిసెగలు దిగదిగనఁ దగులు గగనమణికిరణములనిగని
గలు వెనుదగుల గవులు వెలువడుబెడిదంపుటిరుల గుంపులన మొల్లంబులై
వెళ్లఁబాఱు భల్లూకతల్లజంబులు క్రీళ్లుఱుకు దెసల వసులొడ్డనియమించియు,
మఱియు నుజ్జృంభితగండప్రదేశనివేశంబులును నుదారదంతవిశంకటంబులు
నురుతరపాదప్రకాండంబులు నున్నతవంశదండంబులుం దనర దవదహన
దందహ్యమానతాపంబుల కోర్వలేక పర్జన్యదేవతకు నాక్రోశించు గిరీశం
బు లనఁ బ్రచండంబు లగునెండల మెండున బెండువడి తుండంబు లెత్తి
ఘోషించుచు నీరాశ నీరాశయంబులకుం గ్రమ్ము [2]కొమ్ముటేనుఁగు పదువులు
మెదలుపదవుల నోదంబులు ద్రవ్వ నియమించియు, సకలమృగప్రాణవా

  1. చ-నేకచరానీకంబులకు
  2. కొమ్మేనుఁగని (యన్నిప్రతులలోను)