పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బెళుకుడాల్ జాళువావ్రాఁతపేరోజంపు
దళుకువన్నెకుళాయి యౌదల నమర్చి
నేత్రధరహోంకృతు లెలర్ప విజయశంఖ
వితతులు సెలంగ సదనంబు వెడలుటయును.

15


[1]సీ.

అడుగంటఁద్రొక్కి నయహితప్రతాపశీలములు నాఁ బసిఁడిలాళములు మెఱయ
జవభీతనిజమృగసంరక్షణకుఁ బాద మొందిన శశి యన నందె సెలఁగ
మహనీయగళదేవమణిపార్శ్వఘటితముక్తాపాళి యన గవ్వదండ దనర
ఘనతార్క్ష్యతాదష్టకవికాహినిర్మోకఖండంబు లన ఫేనకణిక లొలుకఁ
బట్టుపల్లంబుఁ గేడెంబుఁ బట్టియంబుఁ, దరకనంబును సింగిణి సిరిమితఱటు
జిగిదొలఁకులేనపాలాసిమొగసరియును, బూని సాహిణి యొకకత్తలానిఁ దెచ్చె.

16


గీ.

తెచ్చినఁ దదీయముఖసముత్థితనితాంత, భద్రసూచికహేషకుఁ బ్రమద మంది
ఫణిహరతురంగసుతుఁడు సాహిణులు సారె, [2]ధీరె యని మస్తరింపఁగఁ దేజి నెక్కి.

17


క.

అపు డెత్తిన నవబర్హా, తపత్ర మవతంసబింబితంబుగ సత్యా
పరిస్ఫురితోత్త
ధిపతనయుఁడు బాల్యాక, ల్పపరిస్ఫురితాత్మగురువిలాసముఁ దాల్చెన్.

18


గీ.

త్రోపుత్రోపాడి యతని కుర్వీపతనయు, లెలమిఁగత్తులతోఁ జేతులెత్తి మ్రొక్కఁ
బసిఁడిపరుఁజులు కోటీరపటలిఁ బొల్చెఁ, దత్ప్రతాపంబు శిరములఁ దాల్చి రనఁగ.

19


గీ.

సకలసేనలు గొల్వ నాచంద్రభానుఁ, డిట్లు వేఁటకుఁ జనుదేర నెఱిఁగి పురము
నలుగడల నంత వెడలిరి నల్లప్రజలు, గాఢమృగయామహోత్సాహకలకలమున.

20


చ.

వలలు నురుల్ సిడుల్ పిసులు వంకరదుడ్డులు పందిపోట్లు దీ
ములు గొరక ల్తెరల్ జిగురుమోకులు బోనులుఁ గాలియుర్లుఁ [3]బోఁ
గులు మిడివిండ్లు [4]బండగులుఁ గొమ్ములుఁ బాదులు వల్లెత్రాళ్లుఁ జి
వ్వలతడికెల్ ధరించి యిరువంకలఁ జేరిరి కొంద ఱుద్ధతిన్.

21


గీ.

కొమ్మటురులుఁ గాలిగుండులు చిలుమోర, లఱుతగవ్వదండ లలఁతిగంట
లమర సారెఁ బెదవు లల్లార్చి గురగుర, మనుచు వేఁటయిఱ్ఱు లరుగుదెంచె.

22


చ.

వెనుకరుమాలు లంసముల వ్రేలెడుకొంచెపుఁజల్దిచిక్కము
ల్పనుపయి కావిబొట్లుఁ బదిలంబుగఁ గట్టినదట్లు రొండ్లఁ జే

  1. ఈసీసము మొదలు “కొమ్ముటురు”లను పద్యమువఱకు ట-లో లేవు.
  2. చ-ధేయనుచు మస్తరింపఁగ
  3. చ-బొంగులు
  4. చ-బందములు