పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మిటమిట నికటికి యెండం, [1]బటపటపటఁ బగిలి పాయవడినవెదురులం
బుట మెగయుచు ముత్తియము, ల్చిటిలినగతి నాడె శాల్మలీతూలంబుల్.

152


[2]చ.

అనలుఁడు రే లినప్రమద యైనప్రభం [3]గెడగూడి యుండి వే
గ నతఁడు దారుణాశుగముఖంబులు వేఁడిమిచూప భీతిచేఁ
గనలుచు ధూమదామమిషఁ గైశికము ల్చెదరంగఁ గానకుం
జనియె ననం దనర్చెఁ దరుసంధుల దావహుతాశకీలముల్.

153


[4]చ.

సవితృమయూఖము ల్నెఱెలసందులఁ దూఱుట యొప్పె దేహసం
భవ మగునట్టిడప్పి యడఁపన్ ధరఁ గల్గుమహానదీనదాం
బువు నెడఁగ్రోలియుం దనివిఁబొందక భానుఁడు ధారిణీతలం
బవిలిచి భోగవత్యుదకమానఁగరంబులు సాఁచెనో యనన్.

154


మ.

తరణిగ్రాహహుతాశహేతి ఫణిపూత్కారార్చిఁ గాంతారదు
స్తరవైశ్వానరకీలఁ దప్తపథికశ్వాసాగ్నినర్కాంశువి
స్ఫురణం గ్రూరతపంబు సైఁచి యచలాంభోజాక్షవాత్యావిసృ
త్వరధూళీపరిపాటి విష్ణుపదపద్యం బొందె నందంబుగన్.

155


చ.

వికచముఖాబ్దము ల్నొగుల వేణులు దూలఁగ నూర్మికాంచిహం
సకవితతు ల్దొలంగ రవిబారి నజీవనలై తరంగణీ
ముకురకపోల లెల్లెడ సముద్గతతాపము సెందఁ గ్రమ్ముఘ
ర్మకణికలో యనంగఁ జెలమ ల్దగు నధ్వగకల్పితంబు లై.

156


మ.

ఘనతాపంబున జంతువు ల్నొగుల మేఘశ్రేణి [5]లే కెందునుం
జనునే వీనిమహార్తి యంచు విధి తత్సామగ్రి గల్పించె నాఁ
దనరున్ దావమునం బొగ ల్వ్యజనబృందవ్యాప్తి వాతూలముల్
మనుజాంగంబుల ఘర్మతోయము లినాశ్మశ్రేణికం దేజమున్.

157


శా.

ఆవర్తానిలముల్ పరిభ్రమణవిద్యాప్రౌఢి సన్మార్గమ
ధ్యావాసంబులు గాంచుట ల్తెలిసి యీర్ష్యాప్తి న్సుపర్వోరువం
శావిర్భూతవిచిత్రభవ్యవనమం దావిద్య సాధింపఁగా
నావేశించినరీతి మందపవమానాంకూరముల్ ద్రిమ్మరున్.

158
  1. చ-పటపటమని
  2. ట-లో లేదు.
  3. చ-జతగూడి
  4. 154,155,156,157,159,160 పద్యములు ట-లో లేవు.
  5. చ-గాకేమిటన్