పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఆయదురాజసూనుఁ డెదురాడఁగ నుల్కుచు విన్నఁబాటుతో
నాయెడ నుండఁగా నళికి యల్లన నైజనివాససీమకున్
డాయఁగ వచ్చి యాత్మనికటస్థితుఁ బాణసభాగ్రగణ్యు శై
నేయతనూజుఁ గాంచి మది నిండిననెవ్వగతోడ నిట్లనున్.

145


ఉ.

లోకమునందు నోవిజయలోల కటా యిటువంటిదిట్టప
ల్గాకి[1]మునీశ్వరు న్వెదకికంటిమె యే నిపు డేగి గానము
న్నా కొకయింత తెల్పు మనిన [2]న్మునుజేసినపక్షపాతముం
గాక పొకాలు మంచుఁ గలఁకం బలికెం బనిలేనిపాటకున్.

146


మ.

అరయ న్వీణకుఁ దానె బ్రహ్మకొడు కేహంకారము ల్గాక తుం
బురు విశ్వావసు శంబళాశ్వతరు లుద్భూతప్రభావోన్నతు
ల్పరికింపం దనుఁ బోలలేరె యిఁక నే యీవితాజోలి యే
వెరనైనం గని కాంతు నిందొకరిచే వీణాప్రవీణత్వమున్.

147


క.

అని సాత్యకితనయుఁడుఁ దా, నును దుంబురువలన నఖిలనుతవీణావా
దనవిద్య నభ్యసింపం, జనుటకు మార్గంబు [3]వెదకుసమయమునందున్.

148


సీ.

కాసారతప్తోర్మికాసారపరిఖిన్నసారసం బున్నాళసారసంబు
భానవజ్వలనోగ్రభానవజ్వలనార్తకువలయం బామ్లానకువలయంబు
ఘనసారసౌరభఘనసారరతవల్లవీజనం బుద్భ్రాంతవీజనంబు
వారణసైరిభావారణక్షుభితనీరాశయం బలననీరాశయంబు
పాటలలతాంతమంజరీపాటలంబు, దారుణధరాపరాగసదారుణంబు
ధూమలలితాటవీవహ్నిధూమలం బు, దగ్రతపనాతపము మించె నాతపంబు.

149


[4]చ.

పుడమి మహోగ్రతాపమునఁ బొక్కఁగఁ బాదము లూఁది త్రొక్కఁగా
జడియుచు భానుఁ డేగ దివసంబులు దీర్ఘము లయ్యె నర్థితో
నడరె మరీచికాచయము లయ్యినునార్తి సహింపలేక వే
యడుగులకు న్మడుంగు లెనయన్ దినలక్ష్మి యొనర్చెనో యనన్.

150


[5]క.

బీరెండల జలజంతులు, దారిన యాదోవరుండు తహతహచే నీ
ట్టూరుపు పుచ్చెనన సెగం, బేరినప్రత్యగ్దిశాసమీరము విసరెన్.

151
  1. ట-తపస్వి ము న్వెదకి
  2. క-ట-న్ముని చేసిన
  3. చ-ట-నరయు
  4. ట-లో నీపద్యము లేదు.
  5. ట-లో నీపద్యము లేదు.