పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఎదుటఁ బిమ్మట నైన నెప్పుడేనియు భక్తి సేయనే న న్నింత సేయనేల
యేయెడ నీ వానతిచ్చినదాస్యంబు సేయనే న న్నింత సేయనేల
[1]నిత్యకృత్యంబుగా నీపాదసంసేవ సేయనే న న్నింత సేయనేల
కలనైన నీమూర్తిఁ గనుఁగొన్న వినయంబు సేయనే న న్నింత సేయనేల
భావవాక్కాయకర్మము ల్నీవశంబు, సేయనే నీవు న న్నింత సేయనేల
సవతిబిడ్డల కిట్లు మత్సరముఁ బెంచి, చివ్వ యొనరింప నింత సేసితివి గాక.

138


క.

అని యిట్లు పలుకుపలుకు, ల్విని తనయత్నంబు కడుఫలించె ననుచు న
మ్ముని యలరి రిత్తబొమముడి, గొని యప్పుడు తెచ్చికోలుకోపముతోడన్.

139


మ.

తగు నయ్యా నను నిట్లు పల్కుటకు సత్యానందనా నీవు ము
న్నుగ నీవీణియ మీటి యీశ్రుతులసంధు [2]ల్గూర్చి యీశుద్ధసా
ళగభేదంబు లెఱింగి యీసకలమేళప్రాప్తము ల్నేర్చి యుం
టిగదా పెక్కులు పల్క నేల బళిరే నీశిష్యతల్ చేకుఱెన్.

140


[3]మ.

మరుఁ డెంతేనియుఁ దెల్సినం దెలియు నీమార్గంబు నీకంటె మా
సరవిన్ ఱొమ్మున నమ్ముగట్టుకొని యాసాయంప్రభాతంబు ని
ద్దురయుం గూడును మాని తెల్పినను నీదుర్బుద్ధి యిట్లయ్యె నెం
తురె మానేరమి గాఁగ నిట్టి వకటా ధూర్తస్వభావంబునన్.

141


క.

తగ వెఱుఁగలేక యిటువలెఁ దెగువరి వై పలుక నీకె తీరెనొ కుసుమా
శుగునకును నీకు నిపు డీ, జగడంబులు సేయఁగా నిచట నిల్చితినే.

142


సీ.

చెల్లఁబో నీచేతివల్లకీరత్నదండము దాల్ప యోగదండంబె మాకు
[4]నయ్యయో నీ చేతియసమవిపంచికగవిసెన ల్కాషాయకములె మాకు
నక్కట నీచేతియలపరివాదినీ[5]తంత్రీలతలు జన్నిదములె మాకుఁ
గటకటా నీచేతికప్పువీణియకాయ సలిలపూరితకమండలువె మాకు
బాపురే నీకు విద్య నేర్పంగవలసి, పడినపా యెల్ల నుగ్రతపంబె మాకు
హరిహరీ నిన్ను నిట్టిదుష్టాత్ముఁ డౌట, నెఱుఁగలేనైతి విడువు మి దేడగొడవ.

143


క.

ఆనలినాక్షుఁడు నేర్పుము, గా నమ్మని ప్రియము చెప్పఁగా [6]బాలుఁడుగా
పోనిమ్మని యే నిందుకుఁ, బూనినఫల మబ్బెఁ జాలుఁ బోపొ మ్మనినన్.

144
  1. చ-లో నీచరణము నాల్గవదిగా నున్నది. ట-లో నీచరణమునకు మాఱు 'పోరామి చెడకుండ గారాముతో భక్తి సేయనే న న్నింత సేయనేల' అని కలదు.
  2. చ-చూచియుం
  3. క-లో నీపద్యము లేదు.
  4. ట-నయ్యరో
  5. చ-తంత్రిక ల్బలుజన్నిదములె
  6. ట-మొకమోటన్