పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వన్నియప్రబంధములు మీటఁ గొన్నినాళ్లుఁ
[1]గోరి గాయంబు లొదవింపఁ గొన్నినాళ్లుఁ
గాఁగ వారల కాజగరాగతపసి
నిరుపమవిపంచికాప్రౌఢి [2]నేర్పి యపుడు.

131


శా.

ఆలేఖవ్రతి మున్ను రుక్మిణికి సత్యాతన్వికిం బూలకై
కైలాటంబులు దా నొనర్చుట మొదల్గా నెక్కడన్ జాఠర
జ్వాలాశాంతి యొనర్పకున్ని మిగుల న్సంతప్తుఁ డై యప్పు డ
బ్బాలుర్ దత్సుతు లౌట నెమ్మనమున న్భావించి సోత్కంఠుఁ డై.

132


ఉ.

ఆహరిసూను లిద్దఱు మహామతిమంతులు గాన సంతతో
త్సాహముతోడ నొండొరులచందము మెచ్చక వల్లకీకళా
దోహలులై చెలంగఁ గని తోడనె వారికి వాదు పెట్టఁగా
నూహ యొనర్చి యందు మరు నొక్కనిఁ గైకొని వీణ నేర్పుచున్.

133

నారదుని పక్షపాతము

,

గీ.

ఆకిటుకు గూటిపఱచి గయ్యాళితపసి, యెంతప్రియములు సెప్పిన నియ్యకొనక
చంద్రభానునిపేరన్న సైఁప కట్లు, పక్షపాతంబు మీఱ నుపేక్ష సేసె.

134


సీ.

సారెలు బెళకినఁ జక్కఁజేయు మటన్న నిదె వత్తు నిలుమని నదికి నేగుఁ
దంత్రు లూడినయవి తగఁ గట్టి యిమ్మన్న జపవేళ యనుచు నిశ్చలత నొందు
శ్రుతు లెల్ల డిగ్గినచోఁ గూర్చి యిమ్మన్న దేవపూజావిధి దీర్చెద నను
నాలాపరక్తికి మేళవింపు మటన్న ధ్యానవేళ యొకింత తాళు మనును
మఱియు నేమాట యడిగిన మమత లేక, చెంగిచెంగి చరించునాచేష్ట లెల్ల
మౌనివరుపక్షపాతంబు గా నెఱింగి, చంద్రభానుఁ డసూయావిచారుఁ డగుచు.

135


క.

ఒకనాఁ డాముని సాగర, సికతాస్థలి నొంటి జపము సేయఁగఁ దనలోఁ
దుకతుకఁ దాళఁగ లే కచ, టికి సత్యాత్మజుఁడు చని నొడివెను మృదూక్తిన్.

136


శా.

అయ్యా నీవు లతాంతసాయకునిపట్టై వల్లకీవాద్యముల్
నెయ్యంబుం బ్రమదంబు నేరుపడ [3]నిర్ణిద్రస్థితిం దెల్ఫి న
న్సయ్యాటంబుల నిద్రపుచ్చితి రహస్యం బేమియుం దెల్పలే
దయ్యా యే నపకారినే తెలుపరాదా నాకు నాచందముల్.

137
  1. ఈచరణము క-లో లేదు
  2. చ-ట-నేర్పి నేర్పి
  3. చ-ట-నిర్ణిద్రుండ వై తెల్పి