పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

స్వర్ణమయపీఠమున మునీశ్వరుని నునిచి, యతనియనుమతిఁ దాను నర్హాసనమును
నధివసించి కృతాంజలి యై మురారి, ప్రబలజలధరధీ[1]రవాక్పటిమఁ బలికె.

116


సీ.

మౌనిమార్తాండ నీమహితపాదనిషేవ మామకపంకసమ్మర్ద మడఁచె
యతిశక్ర నీదుకళ్యాణధామప్రసంగతి సుధర్మావాప్తిఁ గఱపె నాకు
ప్రతిలోకచంద్ర నీరాక మద్వీక్షణోత్ఫలముల కామోదములు ఘటించె
మునిసార్వభౌమ నీఘనహస్తలాలనం బసమదానసమృద్ధి నొసఁగె నాకుఁ
బారికాంక్షిహర్యక్ష నీభాసమాన, గుణసమున్నతి యున్నతకుంభినీశ
గర్వనిర్వాపణధురీణుఁగా నొనర్చె, [2]నన్ను భవదీయవైభవం బెన్నఁదరమె.

117


క.

అన విని నారదుఁ డి ట్లను, వనజోదర నీవు [3]నొరునివైఖరి నీచొ
ప్పున నన్ను వినుతిసేయం, జనునే నినుఁ బొగడఁ గమలసంభవువశమే.

118


గీ.

అఖిలసంయమివరులు బ్రహ్మాదిసురులు, ప్రస్తుతింపఁగ వసుమతీభార ముడుప
యాదవాన్వయమునఁ బుట్టినట్టినీవు, మతిఁ దలంచిన నారమాపతివి గావె.

119


[4]మ.

స్తనపానం బొనరించుచో శిశువునోజం బూతనాక్షీరజీ
వనకీలాలవిషంబు లొక్కమొగి దుర్వారస్థితి న్నీవు గ్రో
లిన నేకార్థవిబోధకంబు లయి పొల్చెం గాదె తత్క్షీరజీ
వనకీలాలవిషంబు లన్పదము లవ్యాజప్రభావోదయా.

120


మ.

సురలోకేంద్రనియుక్తకల్పజలదస్తోమంబు లొక్కుమ్మడిం
గురియన్ ధేనులఁ బ్రోవ నెత్తునపు డాగోవర్ధనోద్యద్ధరా
ధర మింపొందదె నీభుజార్గళమునఁ ధారాధరప్రక్రియన్
[5]హరి నీ వెప్పుడు నాదివర్ణము గురుఖ్యాతిం గటాక్షించుటన్.

121


ఉ.

క్రుంగినకాళియోరగము [6]కూఁకటివేరు భుజార్దళంబు లు
త్తుంగతరప్రకాండములు తోరపునవ్వులు పూలు నర్తనా
సంగచలచ్ఛిరోజములు షట్పదపంక్తులుగా సురద్రులీ
లం గమలాక్ష కోరినఫలంబు లొసంగవె [7]యెట్టివారికిన్.

122


[8]క.

ఏపట్టునఁ గువలయపీ, డాపహృతి యొనర్తు ననుచు యదువంశమునన్
దీపించియుఁ గువలయపీ, డాపహృతి యొనర్పఁ జెల్లునయ్య మురారీ.

123
  1. క-ట-వాక్ఫణితి
  2. ట-నన్న
  3. 'నరునివైఖరి' యనుట లెస్స.
  4. ఇదియు దీనిక్రిందిపద్యమును ట-లో లేవు.
  5. క-హరి నీ వెప్పుడు నాదివర్ణగురువిఖ్యాతిన్
  6. క-కొమ్మలు నీదు
  7. చ-ట-తత్ప్రియాళికిన్
  8. ట-లో నీపద్యము లేదు.