పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యఖిలవైభవముల మించినట్టినాకు, వాంఛిత మొకండు లే దైన [1]వలయుఁ దెలుప
విన్నవింపఁగఁ [2]దగినట్టిచిన్న దొక్క, మనవి గల దాలకింపుము మనుజనాథ.

93


క.

అని పలికి ఱెప్పతుదల, న్నునుసిగ్గు దొలంకఁ దనుఁ గనుఁగొనుసత్యా
వనితతలఁ పెఱిఁగి చూడ్కుల, ననుపమవాంఛితము లొదవ హరి కరుణించెన్.

94


క.

జలజాతాక్షికి నంతట, నెల మసలెం జన్నుమొనల నీలిమ దోఁచెం
దెలు పెసఁగె మేనఁ గోర్కులు, దలమయ్యె న్నిదుర మిగులఁ దావలమయ్యెన్.

95


క.

నవలావణ్యాకర మగు, నవలానెన్నడుము బలిసె నడ జడనయ్యెన్
లవలీపల్లవలీలల, నవలీల జయించెఁ జెక్కు లవదాతరుచిన్.

96


ఉ.

నిద్ధపుసన్ననెన్నడుము నింగి పరిస్ఫుటవృత్తిఁ బూనె లే
నిద్దుర [3]పైకొనందొణఁగె నిర్మలలోచనవారిజాతముల్
గద్దఱిచన్నుజక్కవమొగంబులఁ గప్పు దొలంకసాగె న
మ్ముద్దియ చంద్రభాను నవమోహనసంపదమేనఁ దాల్పఁగాన్.

97


గీ.

అంతరస్థితరాజహంసార్భకాప్తిఁ, గాంతమానస ముత్కలికలు వహింప
[4]నౌర పద్మిని సరసాంతరంగసగసి, సరణి కాందోళనము గల్గె నరుదు మెఱయ.

98


గీ.

చంద్రభానూదయము సమాసన్న[5]మైనఁ
బ్రాచిఁ గనుపట్టు కాంతివైభవ మనంగఁ
జంద్రభానూదయము సమాసన్నమైనఁ
బడఁతిమొగమునఁ గనుపట్టెఁ బాండిమంబు.

99


[6]శా.

లోకప్రస్తుతచంద్రభానుకలితాలోకాత్మనాథానురా
గైకప్రౌఢిమఁ జంద్రభానుకమనీయాలోకసంపన్న యౌ
నాకళ్యాణికి సత్యకు న్సరియె నిర్వ్యాజైకచంద్రప్రభా
సాకల్యంబును బూనలే కెసఁగునాశర్వాణియు న్వాణియున్.

100


మ.

ఒకనాఁ డంతట యాదవేంద్రుహృదయం బుబ్బంగ సౌభాగ్యసూ
చకనిర్వక్రగతిన్ శుభగ్రహము లుచ్చస్థంబు లై భానుచెం
తకుఁ బోకుండెడుసన్ముహూర్తమున నాతన్వంగి గాంచె న్సుతు
న్సుకుమారు న్సురలోకదుందుభీరవస్ఫూర్తుల్ విజృంభింపఁగన్.

101


మ.

కమలాధీశ్వరుఁ డంత గర్గముని యుక్తప్రక్రియన్ జాతక
ర్మము గావింపఁగ నాత్మసూతి కఖిలప్రహ్లాదకాక్షీణధా

  1. చ-స్వామి కిపుడు
  2. చ-ట-తగినది
  3. చ-ట-గైకొనం
  4. ట- ఔర పరపద్మినీరసనాంతరంగ, చ-ఔర పురపద్మినీ
  5. చ-ట-మగుట
  6. ఈ పద్యము ట-లో లేదు.