పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముల నిగిడి తుంపురుల్ చల్లు పూవునీటఁ
దనరువలిగొండ లనఁ గేళిధరము లచట.

80


ఉ.

పచ్చనిరాజనంపుమడిపజ్జబలాకలు చుట్టు నుండఁగా
నచ్చపుఁజెందొవ ల్వెలయు నాపురలక్ష్మికి భూతధాత్రి దా
నచ్చులపేరిహస్తముల సంచుల ముత్తెము లుంచి యెత్తుక్రొం
బచ్చలపళ్లెరంబునడుముం దగునారతిదీవెలో యనన్.

81


సీ.

తనసమీరణవృత్తి తథ్యంబు గావింప గణికావశీకారగరిమఁ బూని
తనగంధవహరూఢి తథ్యంబు గావింప నలసయానప్రౌఢి నలవరించి
తన గత్ప్రణత తథ్యంబు గావింప జనుల కామోదంబు సవదరించి
తనపృషద్వాహాఖ్య తథ్యంబు గావింపఁ జలువ లంతంతకు సంతరించి
తనమరున్నామకంబు తథ్యం బొనర్ప, నసమసాయక[1]సాయకాత్యంతతాంత
విగ్రహులమీఁద నవపుష్పవృష్టి గురిసి, యాపురంబున మెలఁగు [2]మందానిలంబు.

82


క.

ఆనగర మేలు [3]దానవ, మానవతీకుచకురంగమదమకరీసం
తానతిరోధానవిధా,మానితతరవారి శౌరి మహిమోన్నతుఁ డై.

83


క.

ఆవనమాలికిఁ బట్టపు, దేవేరులు గలరు మదవతీమణు లెనమం
డ్రావెలఁదులలో మెఱుఁగుం, దీవెలవలెఁ దనరు రుక్మిణీసత్యలకున్.

84


గీ.

శౌరి మిక్కిలి చనవిచ్చి సంతరించు, సవతు లందఱు లోఁగి యిచ్చక మొనర్తు
రందు రుక్మిణి గనియె ముకుందుకరుణఁ, జెఱకువిలుకాని సురలు జేజేలు పెట్ట.

85


ఉ.

[4]ఇక్కగ ముజ్జగంబు నుతియింపఁగ బంధులు గారవింపఁగాఁ
జక్కనిముద్దులాని నెఱజాణని ఱెక్క మెఱుంగుఁబచ్చఱా
పక్కెరతేజి నెక్కు [5]నవపంచశరుం గని భోజకన్య య
మ్మక్క యనంగఁ జాలు విభవాతిశయంబున విఱ్ఱ[6]వీఁగుచున్.

86


ఉ.

ఆ చెలిఁ జూచిచూచి కడుపారఁగ ముద్దులపట్టిఁ గానఁగా
నోఁచనియింతిజన్మము గనుంగొన [7]రత్త యటంచు సత్యభా
మాచపలాయతాక్షి పలుమాఱును దాఁ దను దూఱుకొంచుఁ జిం
తాచలచిత్త యై యదవద న్మదిఁ గుందుచు[8]నుండ నత్తఱిన్.

87
  1. (సంగరా)
  2. ట-మందానిలుండు
  3. క-దుర్మదమానవతీ
  4. చ-ఇక్కరణిం జగంబు
  5. ట-నజభవ్యతరు, చ-రతిభవ్యతరు
  6. చ-ట-వీఁగఁగన్
  7. ట-జింత
  8. చ-నుండు నయ్యెడన్