పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/25

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కౌశలిఁ జామరగ్రహణకర్మము లూన జనాత్మ లద్భుతా
వేశమునం దముం బొగడ వీటిహరుల్ నెఱపు [1]న్సుధారలన్.

76


చ.

అరుణుఁడు సైంహికేయులకు నల్కి మణీమయఖేటకాకృతిం
గరముల వాల నుగ్రతరఖడ్గమిషంబునఁ బట్టి తెచ్చి యా
సరసిజబంధుశాత్రవుని సారెకు నప్పురిమేటిజోదు ల
య్యిరువురఁ బంత మొప్పఁ గలయింతురు దండకుఁ [2]బూంచి సాములన్.

77


సీ.

ఒక ప్రొద్దు బిగిగూడి యుండుచక్రము లెంత యొకవంకఁ బొగడొందుశకులి యెంత
యొకవేళఁ గాంతిచే నొప్పువిద్రుమ మెంత యొకమూలఁదగుకుందనికర మెంత
యొకపూఁట నివసించునుడుసమూహం బెంత యొకచాయ దీపించుముకుర మెంత
యొకతటి [3]సిరి గూడ నొదవినసుధ యెంత యొక[4]పక్ష మడరుచంద్రకళ యెంత
గరిమ వీరల గుబ్బలు కన్ను లధర
ములు రదంబులు నఖములుఁ దళుకుఁజెక్కు
లలఁతినగవులు [5]మొగములుఁ దలఁచునెడల
ననఁగ వెలయుదు రచటిపణ్యాబ్దముఖులు.

78


సీ.

లలితప్రవాళజాలపయోనిధానముల్ ధారిణిమృగమదద్రవరచనలు
నవ్యపతంగమండలనభస్థలములు రోదసీసురభి[6]ధూపోదయములు
సంవలచ్చపలాళిజలదసందోహంబు లలఘుపురాబ్జగేహాకచములు
చలదుదగ్రపలాశజాలతమిస్రముల్ హరిదేణనేత్రాసితాంశుకములు
కలితసుమధూళిసుమధూళి[7]వలయమలయ
నికటఘటమానపవమాననికరసుకర
చలితఘనసారఘనసారసహితమహిమఁ
దనరు నవ్వీట వాసనావనులు వనులు.

79


సీ.

తావులు లేకున్నఁ దతరత్నశృంగచయంబులో లేమావు లరయు టెట్లు
మ్రోఁతలు లేకున్న ముగ్ధేందుకాంతమార్గములలో సెలయేళ్లు గనుట యెట్లు
చలువలు లేకున్న శాతమన్యవమణిస్థలులలోఁ గలఁకులఁ దెలియు టెట్లు
మలయుట ల్లేకున్న మరకతోన్నతశిలాప్రతతిలో ననఁటు లేర్పఱుచు టెట్లు
జనము లన గొజ్జఁగుల[8]జాఱి చఱుల దుమికి
దొనలఁ గ్రేళ్లుబ్బి కోసలఁ దూఱి జంత్ర

  1. క-చ-సువాలమున్
  2. ట-జూచి
  3. క-గిరిగూడ
  4. క-ట-యాశన
  5. చ-ట-మోములు
  6. భూషోదయ
  7. ట-వలయవలయ
  8. చ-జాఁది, ట-జూచి