పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రాపున గచ్చునిచ్చెనలు పన్నినకైవడి గోపురావళుల్
కైపు వహించె మెట్టుపలకల్వలె వాకిళు లుల్లసిల్లఁగన్.

62


ఉ.

సారెకుసారెకున్ గవనినందుల నప్పురి సొచ్చి యేగువాఁ
డై రజనీకళత్రుఁడు తదగ్రతలస్థితరక్షివర్గముం
జేరి మెయిన్ సికాగుఱుతు చేకొనఁబోలును గాకయున్నచోఁ
బేరినవెన్నవంటిశశిబింబమున న్నెఱ[1]కందు దోఁచునే.

63


చ.

కురుఁజులు సారె లచ్ఛమణికుట్టిమభాగము లిండ్లు మధ్యగో
పురము పణంబుగా నిడిన భూరిసువర్ణము[2]గాఁ జతుర్దిశా
సరసిజనేత్ర లర్థిఁ జవుసారెల నాడఁగ నుత్కటాక్షసం
చరణము మీఱఁ [3]బూ న్పగడసాల యనం జవువీథి చెల్వగున్.

64


చ.

అలుగక దంపతు ల్గదిసి యర్ధసతీశ్వరు పెక్కుమూర్తు లై
యలరఁగఁ జూచి యాత్మవిశిఖావళు లొక్కెడ జైత్రకార్ముకం
బు లొకకడ న్మరుండు వెఱవూని కలంగుచుఁ బాఱవైచె నా
నలరులు నిక్షుదండములు నప్పురవీథుల నొప్పు నెప్పుడున్.

65


ఉ.

సోరణగండ్లవెంట వెలజోటులు వీథులయొప్పుఁ జూచు నొ
య్యారపుఁజూపు లింపెసఁగు హర్మ్యపతాకలు రాయిడింప బృం
దారకదీర్ఘికాంబుజవనంబులు పంపిన దూఱు సెప్పఁగాఁ
గోరి పురాబ్జగేహకడకుం బఱతెంచునళివ్రజం బనన్.

66


మ.

రయగచ్చత్కమలాప్తఘోటకఖురాగ్రక్షుణ్ణకేళీహిర
ణ్మయసౌధాగ్రగళత్పరాగములు గప్పట్టుం బురీనీరజా
లయ యత్యున్నత సంపద న్సురపురీలక్ష్మిం దుటారించి తా
జయముం గాంచిన మెచ్చి బ్రహ్మ కనకస్నానంబు గావించె నాన్.

67


చ.

తళతళ మించు మాడువులఁ దాచినవజ్రపుఁజెక్కడంపుఁగీ
ల్గలజలయంత్రహేమమయకాండము లింద్రునివీటఁ బొల్చుమే
డలు సురసౌధము ల్గెలిచి ఢాకగ నచ్చట గెల్పుఁగంబము
ల్నిలిపినరీతిఁ బై కెగయు నీరు యశోవిభవంబుఁ జూపఁగన్.

68


చ.

చక్కనిమింట నేగునెఱచందురుజింక నవేందుకాంతపుం
జక్కటిఁ [4]దోఁచు రత్నమయసౌధములందుఁ గిరీటిపచ్చఱా

  1. చ-ట - కప్పు
  2. ఇక్కడనుండి "దానము గల్గి”యను పద్యమువఱకు క-లో లేదు.
  3. బూనఁగడసాలె
  4. ట-నున్న