పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]క.

సద్యోజితతాపత్రయ, సద్యోజిత[2]భద్రమననచాతుర్యునకున్
విద్యోతితవిద్యోచిత, హృద్యోదితబోధితార్యహితచర్యునకున్.

53


క.

మాహురపురకృతవసతి క, నీహనుతోన్నతికి నఖిలనిర్జరశుభసం
దోహదవరణోహదవర, దోహదయాశిశిరమతికి ధుతసంసృతికిన్.

54


క.

తత్తాదృశవిత్తాభృశ, కృత్తాదృశరాగయోగికృతచిత్తమహో
దాత్తమతిధ్యేయునకును, దత్తాత్రేయునకు నాశ్రితవిధేయునకున్.

55


వ.

[3]అంకితంబుగా నాయొనర్పంబూనిన చంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధం
బునకుం బ్రారంభం బెట్టి దనిన.

56

ద్వారకాపురవర్ణనము

మ.

సిరికిం బ ట్టయి యొప్పు ద్వారవతి యక్షీణాబ్జరాగోజ్జ్వల
ద్వరణాధిష్ఠితహీరకేసరికరద్వంద్వప్రభిన్నాభ్రసిం
ధురనిర్యన్నవమౌక్తికచ్ఛలసుమస్తోమంబులం గేతనో
త్కరము ల్సారెకు సాఁచి విష్ణుపద ముద్యల్లీలఁ బూజించుచున్.

57


మ.

పరిఖావారిధికూఁతు రైనసిరి కబ్జాతంపుటిం డ్లొక్కెడ
న్విరియు న్మోడ్చు నొకప్పు డంచు మది వానిం జాల నిందించి సు
స్థిరతం బన్నిన సంతతోన్మిషిత మౌ చెందమ్మిచందమ్మునం
బరఁగుం బంగరుకోట వీటఁ బయికొమ్మల్ ఱేకు లై మించఁగన్.

58


క.

ప్రోల న్ముత్యవుఁగొమ్మల, చా లింపగు నమృతపూరసంగతపరిఖా
వాలయుతకర్బురాహిత, సాలంబునఁ జెడనిననలు జనియించె ననన్.

59


మ.

వరణేంద్రోపలకాంతిశర్వరి నిజస్వర్ణంబు లెల్లం బయో
ధరముల్ మ్రుచ్చిలి మారుతత్వరఁ జనం దత్ఖేయవారాశి గో
పురకేతుచ్ఛలన న్మహోర్మినికరంబుల్ సాఁచి వేయన్ గళ
త్కరకాదంతములై భజించు నవి యుద్యన్నీరదాఖ్యానమున్.

60


క.

నరవరమణిహర్మ్యవిభా, కరబంధురకనకవరణకైతవజాగ్ర
త్పరిధియుతమధ్యతలమై, పరిఖాపుష్కరము తేటపడు నవ్వీటన్.

61


ఉ.

ఆపురి నిండువెన్నెలల నగ్రవిధూపలసంభవాంబుధా
రాపటలచ్ఛలామరతరంగిణి ఖేయపయోధిఁ గూడరాఁ

  1. ఈపద్యమును దీనిక్రిందిపద్యమును ట-లో లేవు.
  2. చ-మననభద్ర
  3. ట-సమర్పితంబుగా