పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యోగముద్రైకసూచితాచ్యుతచరిత్రుఁ
డైనవాని దత్తాత్రేయమౌనిఁ గొలుతు.

46


మ.

యతిలీలాయితదత్తచిత్తుఁ డగుపద్మాక్షుండు విశ్వావన
స్థితికిన్ రాజు నొనర్చి యాత్మభుజహేతిన్ సర్వసౌభాగ్యయో
గ్యత లెల్లం గరుణించు నాఁగఁ గృతవీర్యక్ష్మాపసూతి న్నిరా
హతచక్రేశ్వరవృత్తి గా మనుచుదత్తాత్రేయుఁ గీర్తించెదన్.

47


మ.

కమలాకాంతున కెంతసత్కృపయొ లోకశ్రేణిపై బ్రహ్మశ
క్రమహేశాదుల నమ్మ కీజగముయోగక్షేమముం గాంచునె
య్యమునం దానె చరించు నెల్లెడల దత్తాత్రేయయోగీంద్రవే
షమునన్ దీనులఁ బ్రోచుచున్ ఖలులయుచ్ఛ్రాయంబు వారించుచున్.

48


సీ.

ఈముని మునివ్రేళ్ల నెనయునక్షసరంబు పద్మాక్షవిస్ఫూర్తిఁ బరిఢవిల్లె
నీయతి యతిపుణ్యధృతిఁ గాంచుకుండిక తీర్థపదఖ్యాతిఁ దేజరిల్లె
నీయమి యమితసత్కృపఁ గన్న యజినంబు నీలవర్ణనిరూఢి నివ్వటిల్లె
నీశమి శమితాఘవృత్తి నూనినదండ మురుతరానంతవైఖరిఁ దనర్చెఁ
దనపరికరంబు లెల్ల ని ట్లనుపమాచ్యు
తప్రభావంబు లై మించఁ దా ధరిత్రి
నరుదె యోగీశ్వరేశ్వరుం డగుట యనఁగఁ
బొలుచుధన్యు దత్తాత్రేయుఁ బొగడఁ దరమె.

49


మ.

అను వొప్పం బరమాచలాత్మఘటితోద్యత్కుండలిస్ఫూర్తిచే
ఘనపంకాబ్ధి మథించి నిత్యతరయోగశ్రీనితాంతోపగూ
హనరోమాంచసమంచితాంగుఁ డగుదత్తాత్రేయనారాయణుం
డనవద్యామృతసారము న్విబుధలోకాధీనముం జేయఁడే.

50

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశబహుచరితున, కాతారకనిత్యనిజశుభాచరితునకున్
శ్రీతనయాధూతనయా, [1]పాతనయాపితభవర్షిపరిచరితునకున్.

51


క.

అస్మత్కులదేవత కన, ఘస్మరఘస్మరవిరించిఘటితచటుశ్లా
ఘాస్మేరున కస్మయపర, మస్మృతి[2]గోచరునకును నమత్ఖచరునకున్.

52
  1. చ-పాతనయాభితభవర్షి; ట- పాతనయాపీతవర్షి
  2. చ-రోచనునకును