పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సిరిఁగన్నతండ్రియాంతర మెల్లఁ బలుకులకొమ్మయుఁ దలయెత్తికొనుట యెల్ల
శేషపన్నగమునున్మేషవైఖరి యెల్లఁ జదలుమ్రానికడిందిచాయ యెల్ల
నగి తెగడి మీఱి కేరి తృణం బొనర్చి, యడఁచి కారించి వారించి యడరు నేవి
వేకనిధికీర్తి యతఁ డొప్పు [1]వేంకటేంద్ర, దత్తసామ్రాజ్యవిభవుండు దత్తమంత్రి.

41


మ.

ఘనగోత్రోద్ధరణం బసంఖ్యసుకవిగ్రామప్రదానైకసా
ధనసద్భావధురంధరత్వము మహాదర్పోద్దతారీప్రధా
ననిరాసోద్భటపాటవంబు నిరవొందన్ దత్తనార్యుండు శ్రీఁ
దనరు న్వేంకట[2]రాయదక్షిణభుజాదండావిశేషస్థితిన్.

42


క.

ఆదత్తమంత్రి యనుజుఁడ, శ్రీదత్తాత్రేయయోగిశేఖరసేవా
మోదితుఁడ సుధారసధా, మోదితుఁడ న్మధ్వమునిమతోద్ధారకుఁడన్.

43


సీ.

వరగంధచర్చిక ల్వాగ్విస్తరమచర్చికలు సూరిహృదయభాగములఁ గూర్చుఁ
గర్పూరమయవీటికవనాశుపదధాటికలు రసజ్ఞసుహృన్ముఖములఁ జేర్చు
నతిచిత్రనేత్రముల్ యమకాదిచిత్రము ల్మాన్యసత్కవిజనాత్మల ఘటించు
మహితసువర్ణము ల్మధురసందర్భవర్ణములు ప్రాజ్ఞమహాశయముల నించు
గండభేరుండబిరుదవిఖ్యాతమతికి
రాయసము మల్లనికిఁ గవిరాయనికిని
మహిని గవిమానులును మంత్రిమాత్రులును స
మానమే యన వెలసినమానఘనుఁడ.

44


ఉ.

నా కుపకర్త నాకుఁ జెలి నాకు సహాయుఁడు నాకుఁ బ్రాపిల
న్నాకు బహుప్రదుం డని మనంబున వేంకటరాట్సభాజనా
నీకము సంస్మరింప మహనీయగుణోన్నతిఁ గన్న యుత్తమ
శ్లోకుఁడ మల్లనాహ్వయుఁడ సువ్రతు మత్కృతినాథు నెన్నెదన్.

45


[3]సీ.

నిజగర్భగతజగన్నిచయ మారయులీల నంతర్ముఖాపాంగుఁ డైనవాని
నలినజాండావృత్తి నాభివీథికి నేర్పురీతి నక్షసరంబుఁ ద్రిప్పువాని
శ్రుతు లాత్మయంద నిల్పుటఁ దెల్పుతెఱఁగున నవరుద్ధనిశ్వాసుఁ డైనవాని
దనపూనినధరిత్రికి నలోలత ఘటించుపగిది [4]జటిలవృత్తిఁ బరఁగువాని
బ్రాక్తనస్వీయదామోదరత్వ మెఱుఁగఁ
జేయుగతి యోగ[5]పట్టికఁ జెలఁగువాని

  1. ట-వేంకటాద్రి
  2. చ-ట-రాజ
  3. ఈసీసముమొదలు, “ఏతాదృశ” యను షష్ఠ్యంతపద్యమువఱకు ట-లో లేదు.
  4. చ-నిశ్చల
  5. చ-పెట్టియ