పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనవరతాన్నదాననిధి యానరసప్రభు నప్పనార్యు నీ
డనఁ దగునే సుతా[1]పరిణయంబున వేల్పుల కొక్కనాఁడు భో
జన మతిశీతలం బిడిన సాగరరాజుఁ బదింట నైదిటన్
ఘనరుచి దక్క నొక్కొకనిగ్రాన మొసంగుతుషారభానుఁడున్.

36


సీ.

తనదిక్కుఁ జేరుమిత్రునకుఁ దేజము మించఁ దగుసర్వమంగళోత్పాదకుండు
ఘనుల నానాదిగా గతులఁ గైకొని పూర్ణజీవనం బొసఁగులక్ష్మీగురుండు
వరధర్మమున గోత్రవర్గంబుఁ [2]దగుతావు లెనయించి నిలిపినపృథుసమాఖ్యుఁ
డాశ్రితద్విజనాయకావనుం డై తదిష్టైకసంపదఁ గూర్చులోకబంధుఁ
డరయఁగఁ బ్రధానమాత్రుఁడే యఖిలవినుత
మాధ్వదర్శనధౌరేయమాననియమ
పరమహరిగురుచరణాబ్జభజనపరుఁడు
మంత్రినరసయ్య యప్పనామాత్యవరుఁడు.

37


చ.

తదనుజరత్న మై వెలయు దత్తనమంత్రి మహావిపక్షదు
ర్మదబలమర్మదారణధురంధరసంగరచాతురీవిశా
రదుఁ డగు వేంకటక్షితిపురందరు నప్రతిమానరాజ్యసం
పదలు [3]ఫలింప నాకు లిడు భవ్యగతిశ్రితపారిజాత మై.

38


సీ.

వర్ణంబులనె కాదు వరవృత్తతాస్ఫూర్తి సన్నుతోభయవంశజనులయందుఁ
బత్రంబులనె కాదు పంక్తిశోభ సదాప్రదీయమానాన్నభుద్ద్విజులయందు
వాచికోక్తినె కాదు సూచితార్థబహుత్వమతులసత్కవిబుధాశ్రితులయందు
లిఖనక్రియనె కాదు లీలాశుభావనం బానతారాతిప్రధానులందుఁ
బొరయఁలదిర్మలరాయేంద్రభూరిపుణ్య, రాశి యగువేంకటోర్వీసువ్రాయసములు
వ్రాయుచాతుర్యమున నిజస్వామిహితవి, ధానసురమంత్రి నరసయదత్తమంత్రి.

39


మ.

అరుదార స్వరపత్రవృత్త యయి దత్తాత్రేయసంస్పర్శనా
క్షరయోగోన్నతిఁ గన్నలేఖిని మహాగర్వాంధసామ్రాజ్యసం
హరణం బున్నతరాజ్యసంభృతియు ద్వీపాంతరకృపాకర్షణ
స్ఫురణంబు బహుదేశవస్తుభరణంబుం గాంచు నంచద్గతిన్.

40


సీ.

యాదవాగ్రజునిపటాటోప మెల్ల [4]గౌరీవరుసుగ్రీవభావమెల్లఁ
గుముదాప్తుమండలక్రమణచిహ్నం బెల్ల నుడుపరంపర నుండునునికి యెల్ల

  1. క-పరిచయంబున
  2. చ-తనతావు లెనయించి నిలిపినఘనసమాఖ్యు
  3. క-భరింప
  4. చ- గౌరీవిభు