పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వరవృత్తి న్సమమూర్తులై యొరయు నాసంగీతసాహిత్యబం
ధురవక్షోజము లూను తల్లిని భజింతుం [1]దత్ప్రసాదాప్తికిన్.

4


సీ

శారదోన్మేషంబు జగతి సంధించియుఁ బరమ[2]నారదమైత్రిఁ బరఁగుసుకృతి
నుపమైకధన్యుఁడై యొనరియు ననుపమప్రఖ్యాతి గాంచిన భవ్యచరితు
నసమబాణాంకత నలరారియు నలికనేత్రు మెప్పించిన నిర్మలాత్ము
ఘనశబ్దవిస్ఫూర్తిఁ దనరియు హంససమాగమశ్రీఁ గాంచు ననఘశీలు
మఱియు నగణితసుమనస్సమాజమునకు
నక్షరామృతధారారసార్పణమున
నామెతల నిచ్చలు నొనర్చు నలఘుమహిమ
నెఱపినవిచిత్రసత్కళానిధులఁ దలఁతు.

5


గీ.

ఏమహాత్ములు మువ్వురు నిలఁ ద్రిమూర్తు, లట్ల గుఱియై త్రిలింగభాషాహ్వయము య
థార్థ మొనరించి యలరించి రట్టిశబ్ద, శాసనుని దిక్కమఖిశంభుదాసుఁ దలఁతు.

6


చ.

సరసవిశుద్ధవర్ణగుణసంపదయు న్శుచి[3]వృత్తి భావభా
స్వరగరిమంబుఁ బూనని యసారపుమిన్కుఁగరళ్లు సాహితీ
శరనిధిగర్భశోభన[4]కళావిముఖు ల్పచరింప వాని నొ
ల్లరుఁ జెవిఁ బెట్ట రింతయు నలంకృతివైభవధన్యతానిధుల్.

7


వ.

అని యిష్టదేవతాపదాంభోజపూజనంబును సుకవిసభాసభాజనంబును గుకవిజ
నోద్వేజనంబునుం గావించి విరించిగురుకరాంచలసంచాలితామందమందరవ
ధ్యమానదుగ్ధాంభోనిధానసంజాయమాననవీనతరసుధారసమధురతాబ
ధురనవరసభావానుబంధంబును జతురజనశ్లాఘనీయచంద్రభానుచరిత్ర[5]విచి
త్రానల్పచమత్క్రియానిబంధంబును నగు[6]నొక్కప్రబంధంబు నిర్మింపంబూ
నుసమయంబున.

8


ఉ.

కావ్యము సత్కవిప్రకరకర్ణసుధా[7]పరిపూరణక్రియా
భవ్యముగా నొనర్చుట తపఃఫల ముర్విఁ దలంప నట్టిస
త్కావ్య[8]ము నిష్టదైవతవతంసున కిచ్చి కృతార్థుఁడైన యా
యవ్యయభాగ్యరాశిఁ గొనియాడఁ దరంబె జగత్త్రయంబునన్.

9
  1. చ-ద ద్రసావాప్తికిన్
  2. ట-సోదరమైత్రి
  3. చ-వృత్త
  4. చ-దశా
  5. చ-చిత్రికరానల్ప
  6. చ-నొక్కమహాప్రబంధ
  7. చ-రస
  8. చ-మభీష్టదైవ