పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/136

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గనప బంగరుశలాకను జూజువట్టించుపగిది నొక్కతె మేనఁ బసుపుఁ బూసెఁ
నెలదీవెఁ బాఁదున నిలిపి నీరార్చులాగున నొక్కలేమ మజ్జన మొనర్చె
[1]నెలమిఁ గుముదిని నూరార్పి నలసి జిలుఁగుఁ
జంద్రికలఁ జేర్చగతి నోర్తు చలువ లొసఁగెఁ
గలికిపురి నెమ్మినిడుసోఁగ గఱులునివురు
చెలువున నొకర్తు పెన్నెఱు ల్చిక్కుపుచ్చె.

163


క.

తెలిగను నెలపులుఁ గుంబిలు, కలుపొదలన్ మేతఁ [2]మరపఁగా నడుమం గ్రొ
న్నెలమొలక నిలిపెనో యనఁ, దిలకము కపురమున నొకతె దీర్చెం జెలికిన్.

164


క.

లీలావతి యొకతె శ్రుతి, శ్రీలు సుముఖవిధుని కెత్తఁ జేకొను నునుము
త్యాలారతులో యనఁగా, బాలికకు మెఱుంగుఁగమ్మపంజులు చేర్చెన్.

165


క.

మెలపున నిశ్శ్వాసమరు, త్కుల మధరామృతముఁ జేఁదికొనుటకు జాళ్వా
గొలుసులఁ దీర్చిన పటికపుఁ, గలశం బన నొకతె నాసికామణి యిడియెన్.

166


గీ.

మెఱుఁగుఁదీఁగె తళుక్కున మించు కంధ
రాంచలంబున నుండి శైలాగ్రమునకు
జాఱు నాసారములు వోనిసరులు వైచె
నువిదయఱుతఁ గుచంబుల నొరయ నోర్తు.

167


క.

చెలిమో మనుకలువలచెలి, యలకావళిపేరి రజని నలమికొనఁ గరం
బులు సాఁచెనో యనంగాఁ, గలికి యొకతె యునిచె బాసికపుఁబూదండల్.

168


గీ.

ముదిత యొక్కతె విధుమణిముకుర మెదుట, నిలుప నచ్చటఁ దొయ్యలినీడ యడరి
విమలదుగ్ధపయోనిధి వెడలునట్టి, లచ్చిరూపంబు నచటఁ దలంపఁజేసె.

169


క.

ఈరీతిని ననువిందుకు, మారికఁ గైసేయఁ బనిచి మౌహూర్తికవా
క్ప్రేరితుఁడై వైదర్భమ, హీరమణుఁడు వచ్చి లగ్న మెఱిఁగించుటయున్.

170


ఉ.

అండజరాజవాహనసుతాగ్రణి పాండురవర్ణభద్రవే
దండము నెక్కి కల్పకలతాంతసరగ్రధితాతపత్రముల్
నిండిన [3]తారకేందుతతి నింగి ఘటింప మృదంగభేరికా
చండధణంధణధ్వని దిశాకుహరంబుల నాక్రమింపఁగన్.

171


సీ.

గంధతైలాపూర్ణకరదీపకోటితో నరనాథమకుటరత్నములు వెలుఁగ
హైమరథోత్కీర్ణయంత్రపుత్రికలతో వైమానికాంగనావళి నటింపఁ

  1. చ-కుముదినీకాంత నలరింపఁ గోరి
  2. చ-బెట్టఁగా
  3. చ-తారకేందురుచి