పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అట్టియెడఁ గాల్యకృత్యంబు లర్హగతి నొ, నర్చి యాయదువీరనందను లమంద
రథరయంబున నలసినరాజముఖుల, నూఱడించుచు నేగుచో నొక్కచోట.

120


[1]సీ.

మును గురంగములఁ గోసిన రచ్చచట్రాలఁ బేరిన పచ్చికస్తూరివలపుఁ
బులితోళ్లపై నారఁబోసిన రక్తార్ద్రకరిశిరోముక్తాళిఁ గదురుకంపు
వరుసతో ముంగిళ్ల గుఱుజిడ్డువెన్నలు గరఁగింపఁ బొడమెడు కమ్మదావి
కఱివన్నె నెఱిజల్లికప్పుపందిళ్లపై నెండెడు నిప్పపూనిండుగబ్బు
[2]సమదశబరప్రణీతసంకుమదసార, చిక్కణంబై యనరు నొక్కపక్కణంబుఁ
జేరి తదధీశుఁ డొసఁగు సత్కారములకు, నలరి తగుమందిరంబున నధివసించి.

121

ద్వారవతికిఁ జంద్రభానుఁడు శబరుని బంపుట

ఉ.

మంతనమాడి యాదవకుమారకు లచ్చట నుండువాని న
శ్రాంతగతిప్రసిదు నొక[3]శాబకునిం బిలిపించి యాత్మవృ
త్తాంతము తేటతెల్లముగ నంతయు వ్రాసిన విన్నపత్రముల్
సంతస మొప్పఁ జేతికి నొసంగి హరిం గనఁబొమ్ము నావుడున్.

122


[4]సీ.

హృదయప్రమోదవారిధిబుద్బుదంబులగతి మేన ఘర్మాంబు[5]కళిక లొల్క
నతితీవ్రగతి కేన యని టెక్కె మెత్తుతెఱంగున దట్టిచెఱంగు నిగుడ
దృఢతరస్వితకు ధాత్రి యొసంగుకావునా నడుగునఁ బాంసువు లతిశయిల్లఁ
దనుఁ గూడవచ్చు గంధవహంబు బంధించి గెలుతు నన్గతి ముష్టికేలు దనరఁ
బార్శ్వముల సారెనల్లాడు పంచెకట్టు, కోకకొంగులు వేగానుకూలఘటిత
విపుల[6]పక్షద్వయస్ఫూర్తి వెలయుచుండ, రయసముద్ధతి మీఱి ద్వారవతిఁ జేరి.

123


మ.

నడువీథి న్విడిగాలఁ దా నరుగుచుండ న్విస్మయం బంది య
య్యెడఁ బౌరు ల్గని యాడనాడఁ గుమురై యేవార్త యేవార్త యం
చడుగం బల్మఱు మేలుసుద్ది యని [7]యత్యంతంబుగాఁ బల్కుచున్
వడిఁ బదాక్షుహజారముం గదియ నానందంబుతోఁ బోవుచున్.

124


సీ.

కూచి సేయింపఁగాఁ జూచె నందమొ యేల వైద్యుఁ డెఱుంగఁడే శార్ఙ్గలతిక
వెలిగుడారంబుల నిలిపె నందమొ యేల బాణుఁ డెఱుంగఁడే బంధురగద
దాడి వెట్టుటకునై తలఁచె నందమొ యేల నరకుఁ డెఱుంగఁడే నందకంబు
గడీదుర్గములమీఁద విడిసె నందమొ యేల సాళ్వుఁ డెఱుంగఁడే చక్రధార

  1. ట-ఈ పద్యము లేదు.
  2. చ-నమరశబరీప్రణీత
  3. చ-శైబకునిం
  4. ఇదిమొదలుగ మూఁడు పద్యములకు ట-లో "వాఁడునుం జని" యనువచనము గలదు.
  5. చ-కణిక లమర
  6. చ-పక్షద్వయంబున
  7. చ-సువ్యక్తంబుగా