పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/129

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దక్క మ ఱేల కల్గు ననిన న్విని డాయఁగఁ బిల్చి మక్కువన్
గ్రక్కున భీరువేషముఁ దెరల్చి నిజాకృతిఁ [1]బూని యల్లనన్.

111


గీ.

పల్లకీగాలిచెఱఁగు లోపలకుఁ దిగిచి, నెలఁత నీకనుఁగొన్నట్టి నృపసుతుండు
నేన సు మ్మని గుఱుతు లెన్నేని నొడివి, తనతెఱుంగుఁ గుముదినివిధమ్ముఁ దెలిపి.

112


క.

ఆవనితయు నచ్చటకుం, దావచ్చినవిధము దెల్పినఁ బ్రమోదమునన్
భూవల్లభుఁ డిఁక మనముం, బోవలయు నటంచుఁ బల్కఁ బొదలినలజ్జన్.

113


[2]ఉ.

లేనగ వొప్పఁ జేయునదిలేక నతాననయైన నామహీ
జానియు నోలతాంగి మొగసాలను వెల్వడి నీవు నిల్వు మే
లోనికి నేగి యెట్లయిన లోఁగక వెల్వడివత్తు నంచు డెం
దానఁ దొలంకు సంతసమునం జెలరేఁగుచుఁ బోయి యచ్చటన్.

114


[3]చ.

మగఁటిమి మీఱ సాత్యకికుమారుఁ డదృశ్యతఁ బూని పాలకిం
డిగి మొగసాల వెల్వడి వడిం బ్రియఁ దోడ్కొని నర్మదాతటిన్
నగతనయాధినాథభవనంబునకుం జని కాంచె నందు ము
న్నుగ రథ మెక్కి తద్వరతనూమణిఁ దెచ్చిన యన్న నయ్యెడన్.

115


మ.

తరుణు ల్వెల్వడి యిట్లు పోవుటయు సంతాపంబున న్భీమభూ
వరపుత్రుం డరయించి కానక కృధావ్యగ్రాత్ముఁడై యుండఁ ద
త్సరణిం గన్గొని యాక్షణంబ దమఘోషక్షోణిభృత్పుత్రుఁడున్
మరలె న్బుత్రునితోడ సైన్యములతో మాహిష్మతిం జేరఁగన్.

116


ఉ.

అప్పుడు కిన్నరార్పితశతాంగలలామమునం గుతూహలం
బొప్పఁగ నెక్కి యయ్యువతియుగ్మముతో యదువంశవల్లభుల్
చప్పుడు సేయ కేగి రతిసాంద్రవనీనిచయంబు లేర్లు బల్
తిప్పలు పక్కణంబు లవలీలల దాటి మనోరయంబునన్.

117


క.

అత్తఱి వారల మనములఁ, దత్తఱము శమించురీతిఁ దమ మడఁగె మదిం
గ్రొత్తగ ననురాగము చిగు, రొత్తుగతిఁ బురోనురాగ ముజ్జ్వల మయ్యెన్.

118


చ.

సకలజగన్నివాసుఁ డగుశౌరికుమారునిపెండ్లి యంచుఁ బ
క్షికులరవంబుచే నెఱుఁగఁజేసి కరస్ఫురణన్ [4]ధరేశపం
క్తికి నరుణాంకురాక్షతతతిం దగ నీఁదొలుగట్టుటొజ్జ గై
రికమయపాత్ర మెత్తె సన ఱిక్కలగొంగ తనర్చెఁ దూర్పునన్.

119
  1. చ-దెల్ఫి యల్లనన్, ట - బూని యిట్లనున్
  2. చ-ట-లో నీపద్యము లేదు.
  3. చ-లో నీపద్యమును దీనితరువాతి పద్యమును లేవు.
  4. చ-దిగీశపంక్తికి