పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ననుఁ గని మున్ను కొంత దమి నాటఁగఁ జూచుటఁ జేసి లాఁతివాఁ
డనక మృణాలనాళమృదుహస్తము లెంతయుఁ జాఁచి కౌఁగిట
న్నినిచి యొకింతయుం దెలుపనేరనితత్తఱపాటుతోడఁ గో
పనమదహస్తి హస్తి యని పల్కెఁ దలంకు దొలంకుపల్కులన్.

76


ఉ.

ఆపువుఁబోఁడి యీగతి భయంబునఁ గౌఁగిటఁ జొచ్చి పల్క నే
నేపరిపాటియైన వగ నెంచక కేవలతన్మయానుమో
దోపచయంబుఁ గంటి మఱి యున్నదె ధాత్రి హఠాదవాప్తయో
షాపరిరంభసంభ్రమజసౌఖ్యముకంటెఁ బ్రమోద మేరికిన్.

77


క.

అడ లెడలఁ బలికి యప్పుడు, జడియకు మని సారె వెన్నుఁ జఱచి యెలమి న
ప్పడఁతుక నెత్తికొని రయం, బడరఁగ నే నొక్కకడకు నరుగుచు నెదుటన్.

78


ఉ.

వామనతీర్థతీర మనివారణవారణవారణక్షణే
చ్ఛామహితప్రచార మురుసారససారససారసంభ్రమో
ద్దామతరంగవారము సదానవదానవదానవర్ణిత
శ్యామలమూర్త్యుదారము శుభావనభావనభావనారమున్.

79


క.

కని యుక్కలికోజ్జ్వలమై, ఘనరససంభరితమై ప్రకంపనయుతమై
వనితామణిచిత్తముగతిఁ, దనరెడు నాసరసిఁ దఱిసి తత్తీరమునన్.

80


సీ.

పయినాడు తుమ్మెదపదువు క్రొంబొగలతోఁ బాటల కుసుమదీపములు వెలుఁగ
నానందనిభృతకీరాదిచిత్రములతోఁ బాయని చిగురాకుపటము లెసఁగ
వ్రాలెడు గెలబోదెకీలుదామరలతో స్థూలరంభాతరుస్థూణ లలర
నకృదాగతార్కభాస్వర్ణశృంఖలలతో నల తెలిదీపయుయ్యెలలు దనర
నరుణకాంతాగ్నిపతితసితాభ్రధూప, ముల [1]వలచు నొకపొదరింట లలనఁ దార్చి
కురు లెనయ దువ్వి చెమ టార్చి సరులు దీర్చి, బుజ్జగించి ముదంబునఁ బొదలునపుడు.

81


ఉ.

[2]ఆగజరాజ మన్యవిపినాంతవశావశచిత్తమై నిజే
చ్ఛాగతి నేగఁ దత్సఖులు చంద్రముఖి న్వెదకంగ వచ్చి త
ద్భాగమునందుఁ గన్లగొని ముదంబునఁ దోడ్కొనిపోవ నావనా
భోగమునందు నిల్వ కెడఁబొక్కుచు నంగజుబారిఁ జిక్కుచున్.

82


సీ.

తలిరుటాకులమీఁద నొలుకు తేనెలఁ జూచి పల్లవాధరి లేఁతపలుకుఁ దలఁచి
మెట్టుతమ్ములమీఁద మెలఁగు తేఁటులఁ జూచి సరసిజవదన ముంగురులు దలఁచి

  1. చ-నమరు
  2. చ-ఆగజరాజు మధ్యవిపినాంతవశావశచిత్తమై