పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బొలయఁగ నాపయిం జిగురుఁబోఁడి కటాక్షచయంబు నించె బూ
విలు గొని పంచసాయకుఁడు వెంటనె క్రొవ్విరితూపు లేయఁగన్.

70


క.

మఱువెట్టి చూచు నేఁ గ్ర, మ్మఱఁ జూచిన డాఁగుఁ జెంత [1]మగువలఁ గని నా
తెఱఁ గడుగు మగుడఁ గనున, త్తఱి నాకలకంఠి మన్మథవళాకృతి యై.

71


ఉ.

[2]ఆయలివేణికీ లెఱిఁగి యంతట నెచ్చెలి చేరి యక్కటా
యోయెలనాఁగ యింతతడ వొంటిమెయిం దరుణు ల్వనంబులో
నూయెల లూఁగు వేడుకల నుందురటే మనవారలెల్ల న
ల్లాయెడ నున్నవారు పదమా యని పల్కఁగ నాక్షణంబునన్.

72


సీ.

సామిసందష్టశశియైన సైంహికేయు, నగ్రమునఁ బూని తనరు మహాబ్ద మనఁగఁ
గ్రాంతదంతనితాంతోగ్రకరముతోడఁ, గరము భీకరముగ [3]నొక్కగంధకరటి.

73


[4]సీ.

కటనిస్సృతమదాపగావీచికణములకరణిఁ బైపై భృంగగణము లడర
గాఢఫూత్కారవే[5]గవిశీర్ణకుంభముక్తారీతి హస్తశీకరము లొలుక
సౌరధునీమధ్యసంభిన్నయమునానుకారియై రదయుక్తకరము దనర
సకలజంతుక్షోభసంధాయి ధూమకేతు స్ఫూర్తితో నెత్తుతోఁక యమర
నోరమై శైలములఁ జెక్కు లొరసికొనుచుఁ
జేఁ గఱచి సా నలుగుచు వేగ నరిగి
తరువు లగలించి యెత్తుచు దరి వొడుచుచుఁ
గ్రూరగతిఁ దద్వనక్షోణిఁ జేరుటయును.

74


సీ.

తద్ఘనాఘనఘనౌద్ధత్యవిస్ఫూర్తికి హంసకప్రచయ మందంద తూల
నామహోదారసారంగంబురవళికిఁ గర్ణికాజాలంబు కంప మొందఁ
దద్దుష్టకుంభినీధనమౌళి దుర్మదోగ్రతకు రత్నాకరరశన దలఁక
రూమత్తమాతంగభీమవృత్తికి నగ్రహారనాయకమణు లవిసి చెదరఁ
గౌను లసియాడ జఘనము ల్గదలఁ బాద
పదములు దొట్రువడఁ [6]గచభరము లులియ
నూరుపులు సందడింపంగ నుత్ఫలాక్షు
[7]లెడనెడన పాటి పఱవ నయ్యిందుముఖియు.

75
  1. చ-ట-మగువఁ బిలిచి
  2. చ-ఆయెలనాఁగ
  3. ట-వచ్చె గంధకరటి
  4. ట-లో నీపద్యము లేదు.
  5. చ-వేగక్షరత్కుంభ
  6. చ-గభభరము లురుల
  7. చ-ఎడనెడఁ బఱవ నంత