పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/121

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇలఁ జూపు వలచేయి వెలిదమ్మికనుదోయిఁ జెలఁగువానిఁ బయోధి మెలఁగువాని
దట్టిఁ జేర్చిన వంకి గట్టుమీఁదటి టెంకిఁ దనరువానిఁ బురారి నెనరువాని
నెడమపెందొడఁగేలు నెడఁ జేరిచినయాలు నెసఁగువాని శుభంబు లొసఁగువాని
నిండుబంగరుపట్టు కొండవంచిన మెట్టు వెలయువాని శుకాత్మ నొలయువాని
చికిలిజగిచుట్టుకత్తి జేజేలుబత్తి, నెఱపువాని సురారులఁ బఱపువాని
వేంకటస్వామిఁ గనుఁగొని వినయవినమి, తాంగవైఖరి మెఱయసాష్టాంగ మెఱఁగి.

57


శా.

కాల న్ముత్తెగజాలు వేఁడిచలువల్ గ్రమ్మించుకన్డాలు కెం
గేలం బట్టినచుట్టువాలు నెడచక్కిం గల్మిప్రొయాలు నే
వేళన భక్తులఁబ్రోచుమేలు తెలిదీవిం బొల్చు పెన్బ్రోలు ని
ర్మేలం బాయనివేల్పుచాలు గల సామిన్ వెన్నునిం గొల్చెదన్.

58


శా.

ఆర్తత్రాణపరాయణాయ భువనైకాధారభూతాయ సం
వర్తాంభోనిధిమగ్నభూభరణకృద్వారాహరూపాయ దో
ర్వార్తాభీతమహీసుతాయ శిశుతావ్యాపారనశ్యత్తృణా
వర్తక్రూరనిశాచరాయ దివిషద్వంద్యాయ తుభ్యం నమః.

59


చ.

అని కొనియాడి తత్పదయుగాబ్జపవిత్రితతీర్థవారిలోఁ
గొని గతకల్పషుండనయి కోవెల వెల్వడి [1]బిల్వపాండవా
దినిఖిలతీర్థపంక్తుల క్షితిత్రిదశోదితరీతి భక్తి మ
జ్జన మొనరించి యర్షవిధి సల్పి క్రమంబున నేగి చెంగటన్.

60


సీ.

రేరిక్కరాఱాల నూరిననీ రేఱులై తూఱ నీరిక లైనచోటఁ
గ్రేళ్లుబ్బి సెలలు దాఁకిననుర్లు నెత్తాల నలరు కానలఁదారు తలిరుఁగత్తి
ఱేని [2]బాబాలేఁతఱెక్కసోఁకులసారెఁ దలఁకునీరంబుల నొలుకు తెలిసి
రంబుతోఁ దనర నొరలుకన్నెక్రొన్నన తేనెసోనల పసలైన నేలఁ
దొలఁకుకొలఁకులకెలఁకులఁదళుకుగులుకు, నున్నతిన్నెలఁ దరలక నూలుకొనిన
[3]కిన్నెరకలకలంబుల కేకికరుతు, లూనుచుండెడు తుంబురుకోన డాసి.

61


లయగ్రాహి.

రేవగలు ఠీవిగల తీపనసదీవిలయ కైవెఱచి పోవుటిరు లేవలనఁ బ్రోవం
[4]గేవలము ఠీవిఁగను కావియెలమావితలిరోవరుల సావిఁదగు లేవిరులలోనం

  1. చ-ట-భీల్లపాండవాది
  2. చ-బాచాచాలు
  3. చ-ట-కిన్నరీకలకలముల కేకి కురక, కోకరతు లూను తుందురుకోనలోన
  4. చ-ట-గేవలము ఠీవిగను