పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/118

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వడఁకెడు పిల్లలం బొదివి [1]వత్తులు గట్టినయట్టిమేనఁ దు
ప్పుడుగరుపాఱఁ గోటరపుఁబొంతల డాఁగెఁ బతంగసంఘముల్.

38


[2]సీ.

అసటిలో దిగఁబడి విసికి వెల్వడలేక యెలుఁగెత్తి పొలమర్లఁ బిలుచువారుఁ
గఱియరేవడిఁ బదాగ్రములు జిఱ్ఱన జాఱఁ బ్రాంతభూజము లూఁతపట్టువారు
నెదురువానకుఁ దలయెత్తక యేగుచో ముందఱ గానక మ్రొగ్గువారు
గొబ్బున జల్లు పైకొన్నఁ జెట్లను జేరి వంగుళ్లు ఘనమైన వడఁకువారు
నయి ముదురుజంబుగూడల బయి ధరించి
మొక మొకించుక గానరా ముసుఁగు వెట్టి
కేలనోరచ్చు [3]మడత్రాళ్లు వ్రేలుచుండ
నమ్రగతి నధ్వగులు త్రోవ నడచి రపుడు.

39

తిరుమలయాత్రావర్ణనము

గీ.

వార్షికదినంబు లిట్లు దుర్వారలీల, ధర విజృంభించువేళఁ బాంధప్రతాన
సహితముగ నేను బెక్కుదేశములు గడచి, యంతఁ బోవంగ మార్గమధ్యంబునందు.

40


[4]సీ.

అసశనవ్రతముచే నతులకార్శ్యంబునఁ గనుపట్టునోరిబీగములవారు
మ్రొక్కుఁ దీర్చుటకునై మూఁకమూఁకలు గూడి యేతెంచుతలమోపుటిండ్లవారుఁ
బ్రాణముల్ పిడికిటఁ బట్టుక యిట్టట్టు దెమలని [5]శిరసుకోడములవారు
దైహికాయాసంబు దలఁపక దొర్లుచు నడతెంచుపొరలుదండములవారు
నామటామట మ్రొకువా రడుగునడుగు, దండములవారు మిగులసందడి యొనర్ప
నడరి పన్నగసార్వభౌమాచలేంద్రుఁ, గొలువఁ గోటానుకోట్లు పెన్గూట మరుగ.

41


గీ.

ఏను వారలతోఁ గూడి యెలమి దిగువ, తిరుపతికి నేగి యాళ్వారితీర్థవారిఁ
దానములు సల్ఫి యుచితకృత్యములు దీర్చి, సంతసంబున నప్పురాభ్యంతరమున.

42


సీ.

పైఁ బొల్చు తొలుద్రాఁచుపడఁగయూరుపుఁబొగ ల్నాభిపంకజమిళిందములు గాఁగ
ఘనతలగ్రావభాగంబున కాజానుఘటితహస్తం బజగరము గాఁగ
మలఁచి తలాడగా నిలిపిన వలకేలినఖరుచు లౌళికుంచములు గాఁగ
నోరగాఁ గుడివంక కొఱగుకాస్తుభిరుచి శ్రీవత్సఘనరతటిద్రేఖ గాఁగ
రాత్రిఁ బవలును జారునేత్రద్వయంబు, పాదసంవాహనక్రియాపరవశకమ
[6]లోరుతలకుముదాబ్జధీకారి గాఁగ, వేడ్కఁ బవళించియున్న గోవిందుఁ గొలిచి.

43
  1. చ-వత్తులు పొత్తులు గట్టిమేన
  2. ట-లో నీపద్యము లేదు.
  3. చ-వెడవాళ్లు
  4. ట-లో నిదిమొదలు 45వ పద్యమువఱకు లేవు.
  5. చ-సిరసుకొండెములవారు
  6. లోరుతరకుముదధీకన్యశారి గాఁగ