పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/115

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కావున నీపుత్రికి వసు, ధావలయమునందు వాఁడె తగు వరుఁ డిఁక నీ
వేవిధమును దలఁపక ప, థ్వీవల్లభ యతని కిమ్ము వే యేమిటికిన్.

16


చ.

అనుటయు రుక్మబాహువసుధాధిపుఁ డాప్తసుహృజ్జనంబుతోఁ
దనయవివాహకృత్య ముచితస్థితి నెంతయుఁ దెల్పి వారిచే
ననుమతుఁడై ప్రమోదమున నమ్మునినాథుని వెంటఁ జేదిరా
జునకు నిజాప్తమండలికి శోభనలేఖలు పన్ప నచ్చటన్.

17


[1]క.

చేదిధరాధవుఁడును స, మ్మోదము రెట్టింప బంధుముఖ్యుల మగధే
శాదీవసుధాధినాథుల, నాదరమునఁ బిలువనంపి [2]యతివేగమునన్.

18


గీ.

శుభముహూర్తంబునం దాత్మసుతయుతముగ
ధారిణీసురమంత్రము ల్పేరఁటాండ్ర
ధవళముల నాదములును వాద్యములరవళి
బోరు మని మ్రోయ నాత్మీయపురము వెడలి.

19


[3]సీ.

పాదాతకరకుంతపటలఘర్షణధూతరథకేతుమౌక్తికవ్రాతరజము
కూబరఘర్షణక్షుణ్ణవారణఘంటికాపద్మరాగనికాయధూళి
నవ్యకక్ష్యాఘర్షణప్రోత్థహయగళార్పితధామమరకతరేణువితతి
పల్యాణఘర్షణప్రస్ఖలద్భటమౌళిరత్నగోమేధికవ్రజపరాగ
[4]మలమఁ జత్రాకృతిఁ దనర్చు సంబరంబు, తనకు దిక్పద్మనయన లెత్తినమెఱుంగు
లడరుమంజటినన్నెయుల్లడ యనంగఁ, దనర నొయ్యనఁ గుండినమునకుఁ జనియె.

20


ఉ.

అంతకు మున్న భీమవసుధాధిపసూతి చమూసమేతుఁడై
యెంతయు వేడ్కతోడ నెదురేగి రయంబునఁ దోడి తెచ్చి గే
హాంతికకేళికావనమునందుఁ దగ న్విడియించి వారికిన్
సంతస ముప్పతిల్ల నుపచారవిధు ల్సవరించుచుండఁగన్.

21


ఉ.

ఆవిధ మెల్లఁ బ్రాణసఖు లారసి వచ్చి యెఱుంగఁబల్కఁ జిం
తావిలచిత్తయై కువలయాధిపునందన కూర్మిబోటిచే
నావనజాక్షసూతికిఁ దదన్యకరగ్రహణానపేక్షయుం
గేవలసాహసైకనిజకృత్యముఁ దేటగఁ దెల్ఫి పంచినన్.

22


గీ.

జనవరేణ్యునియత్నంబు విని నితాంత, దుఃఖితుం డయ్యు నతఁడు వధూవయస్య
వచనములచేతఁ గొంతయాశ్వాస మంది, చైద్యబలసంకులారామసరణి వెడలి.

23
  1. ట-లో నీపద్యము లేదు.
  2. చ-యతిమోదమునన్
  3. ఈపద్యము ట-లో లేదు.
  4. ద-మనులచిత్రాకృతి