పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/112

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గొని యుండం గని తచ్చిఖాగ్రహణ మర్కుం డల్కఁ గావించెనో
యనఁ బైపై నిగిడెం గరంబు లగకూటాభోగభాగంబులన్.

143


మ.

సరవిం దామరబానవాల్మగువ భాస్వద్రామపాదాప్తి భా
గ్యరమోత్కర్షము కల్మిఁ గర్కశమహాగ్రావస్థితు ల్వో ముఖ
స్ఫురణ ల్దాల్చి సముజ్జ్వలాపయనయై సొంపూనఁ దత్ప్రాప్దుత
స్తరశాపాక్షరపంక్తినా వెడలె నంతర్మగ్నరోలంబముల్.

144


గీ.

అట్టియెడఁ గాల్యకృత్యంబు లలసగతులఁ
గడపి నెవ్వగఁ గుముదినీకాంతయాత్మ
నెలకొనిన తాప మొరులకుఁ దెలియనీక
విభుని వరియింప సమయంబు వెదకుచుండె.

145


మ.

అలఘుజ్ఞానతరంగరంగదళికస్యందిద్రవేందుస్పృహా
చల[1]షట్కంజభుజంగ జంగమగుణాంచత్కాంచనోర్వీధరో
జ్జ్వలలక్ష్మీ[2]వశగాంగ గాంగఝర[3]వైశద్యాస్పదాభంగని
ర్మలచిత్తోజ్ఝితసంగ సంగరజయప్రాప్తిప్రహృష్టార్జునా.

146


క.

అత్రిమునిపూర్వపర్వత, మిత్ర జగన్మిత్రబల[4]సమిత్త్రస్తగుహా
చ్ఛాత్రోష్మవీతిహోత్రధ, విత్ర యసత్తృణలవిత్ర వినయపవిత్రా.

147


[5]మాలిని.

ఉదరదహరసద్మాభ్యుద్గతోన్నిద్రపద్మా
పదయుగచిదమోఘాపాతిదివ్యామృతౌఘా
విదితశయనయోగావిష్కృతోద్బోధనాగా
హృదయ[6]నిటలసీమాహిండితాఘర్మదామా.

148


గద్య.

ఇది శ్రీదత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందనందనసమాసాదిత
సరసకవితారసోదాత్త దత్తనామాత్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం బైన
చంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. చ-షట్కాబ్జ
  2. చ-శుభ
  3. చ-వైపద్యాస్పదా
  4. చ-సమిర్ధ్వస్తగురుచ్ఛాత్రోష్మ
  5. ఈపద్యము ట-లో లేదు.
  6. చ-నికటసీమా