పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/108

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఉన్నట్ల యుండి ప్రద్యుమ్నుతోఁ గలహించి విద్యార్థినై యేల వెడలవలసె
వలసెఁబో త్రోవ దుర్వాసుశాపంబున విజయలోలుం డేల విడిచిపోయెఁ
బోయెఁబో నేను నీ[1]పురి సొచ్చినది మొద లీ[2]కుముదిని రూప మేల వింటి
వింటిఁబో వనములో వీణ వాయించుచో నేతెంచునాకన్నె నేల కంటిఁ
గంటిఁబో యంతలోననె కమ్మవింట
గొనయ మెక్కించి మరుఁ డేల కూఁత నేసె
నకట శౌరికి సత్యకు నవతరించి
నట్టినాకును దైవ మీ[3]యడలు దెచ్చె.

116


సీ.

తరియింతు నెటువలెఁ బరవాది విరవాది నెఱవాదితావుల [4]మెఱయుగాడ్పు
భరియింతు నెటువలెఁ బరువంపుమరువంపుగరువంపువిలునింపుశరచయంబు
మలఁగింతు నెటువలె నెలదీవి యలదీవి నలదీవియల మీఱు తలిరుడాలు
దొలఁగింతు నెటువలెఁ బలుమాఱుఁ బొలి మీఱు బలుమారు బాబాలకలికిరొదలు
సొరిది నేత్రాబ్జములు విచ్చి చూతు నెట్లు
సాంద్రమోహతమంబుతో సైఁతు నెట్లు
ప్రౌఢశశిమాంత్రికవికీర్ణపథికహనన
భసితసితసాంద్రచంద్రికాపాటవంబు.

117


మ.

అనిపల్క న్విని యంత నాతరళికాబ్జామోద యత్యంతసం
జనితాశ్చర్యముతోడ నాత్మ నతని న్సత్యాసుతుం జంత్రభా
నునిగా నెన్నుచు నాకుమారకుపయి న్నూల్కొన్న యాత్మీయస
ఖ్యనురాగం బుచితోపయుక్త మని యత్యానందముం జెందుచున్.

118


సీ.

చంద్రభానుఁడు కాన సమధికంబై మించు వెల్లఁదనంబున వెలయువాని
గృష్ణపక్షంబున నెనఁగినరాజౌట నంతకంతకుఁ గార్శ్య మడరువాని
బ్రద్యుమ్నరుచిగాన భరియింపఁగారాని గాటంపుఁగాఁకచేఁ గరఁగువాని
నిత్యానిరుద్ధనుస్నేహదీపకుఁడౌట మలయానిలమునకుఁ దలఁకువాని
నరయ సత్యాత్మసంభవుఁ డైనకతన
నతనుశరవర్ధితాంగుఁడై యలరువాని
నాకుమారవరేణ్యు డాయంగ నరిగి
వినయవినమితవదనయై వనజగంధి.

119
  1. చ-ట-పురిఁ జేరినది
  2. క-కుముదినిరూపంబు గుఱుతువింటి
  3. చ-యడరు
  4. చ-నొరయుగాడ్పు