పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రభానుని పరితాపము

సీ.

హృదయవాసిని యైనమదిరాక్షి, లేనవ్వు లభినవపాండిమం బలవరింప
స్వాంతసంగత యైన కాంతలేఁజూపులు తనువునఁ జాంచల్య మనువుపఱుపఁ
జిత్తచారిణి యైనమత్తకాశినిమోవి కన్నులనెఱసంజ గడలుకొలుప
సంకల్పగత యైనపంకజాననకౌను తానవం బంతకంతకు నిగుడ్ప
మానసావాస యైనభూజానిపుత్రి, పిఱుఁదు కోర్కులకెంతయుఁ బెంపు నెఱపఁ
బలవరించుచు నాచంద్రభానుఁ డపుడు, నిలువరింపఁగ లేక కన్నియఁ దలంచి.

109


చ.

చుఱుకుచుఱుక్కునం దనువు సోఁకెడు వెన్నెల కాలుకొల్పుచుం
జఱవఁగఁజొచ్చెఁ దెమ్మెరలు చక్కనిజోదు శరమ్ము లేయఁగాఁ
గఱకరియయ్యె నిట్టియెడఁ గౌఁగిట న న్దయఁజూడ కక్కటా
తెఱవ యెఱింగితే నెగులు దీర్పఁగదే [1]తగవే కలంపఁగన్.

110


ఉ.

కన్నుల దోరచాయ లలికంబున లేఁజెమ రుబ్బుగుబ్బలన్
గ్రొన్నెలవంకసొమ్ము లఱగ్రొమ్ముడి జాఱినపూలు వాతెఱం
జిన్నిమెఱుంగుకెంపు లెదఁజిట్లిన గందము గల్గునట్లుగాఁ
గన్నియ ... ... ... ... ... ... ... ... ... ...

111


ఉ.

రాణమెఱుంగువెన్నెలఁ గరంగిన క్రొన్నెలఱాలమేడలం
బ్రాణసమా .... .... .... .... .... .... ...
వీణయ ముట్టి పంచశరవిక్రమము ల్పచరించుగీతముల్
గాణతనంబు మీఱఁ బలుకం గలభాగ్యము నాకుఁ గల్గునే.

112


చ.

పలుచనిమేను లేఁగొసరు[2]పల్కులు ముద్దులమోము చిన్నిగు
బ్బలు జడగూడువెండ్రుకలు బంగరుచెక్కులు చేరెఁడేసిక
న్నులు నునుముత్తఱుల్ మినుమినుక్కనుకౌను మెఱుంగువెన్నెలల్
కులికెడు నవ్వునుం [3]గులుకుకోమలి ని న్మదిఁ [4]ర్చ చేసెదన్.

113


క.

కలువా కనుఁగవ గొఱనెల, చెలువా నెన్నొసలు కప్పుఁజిలువా జడ యో
చెలువా పదివే లైనను, విలువా నినుఁ జూచి గారవిలువారలకున్.

114


క.

తుహినకరవదన నీగతి, బహుభంగులఁ బలికి చంద్రభానుండు ముహు
ర్ముహురుపహితవిరహార్తిం, దహతహపడి యాత్మచర్యఁ దలఁచి కలంకన్.

115
  1. ట-తగదే
  2. చ-పల్కులముద్దులమోము
  3. చ-ట-గలుగుకోమలి
  4. చ-ట-చింత సేసెదన్