పచరించుచు నెఱుకు తెఱంగున విర్ల నుర్లఁద్రోయుచు నామనిగోమునఁ
గొమ్మల నలరించుచు మానిని [1]యనువున నుడువుల నాఁగుచుఁ [2]గాకము
లకు నభిసారికానీకములకు నడలు వెంచుచుఁ దరంగనదీతీరంబులకుఁ గురం
గేక్షణావారంబులకుఁ గలువసొంపులు [3]నింపుచు, మఱియు నొక్కయెడ
లలితమణిమయసౌధతలంబులఁ బ్రసవశరకేళికై మల్లాడు నిజవల్లభు లల్లన
పోఁకముడి [4]కేల సడలించినఁ దెగడువడి వెగ్గలంబుగ బెగ్గిలి డిగ్గన లేచి
వాతాయనాయాతశీతకరకరాంకురంబులఁ దారి గనఁబడకునికి మనంబునం
బెనఁగొనిన నాన నానతవదనలై కెళవులు గనుఁగొను నవోఢాంగనల
మెఱుంగుకన్నులచాయఁ దుఱంగలించుచు, మఱియు నెల్లెడఁ బాలవెల్లి
వెల్లివిరిసినచందంబున నందంబు చూపు బయట చిట్టకంబులకుఁ [5]బట్టువడని
ముగుదలఁ దదీయాంగంబులు బయలుపఱుపఁబడనీనితరుచ్ఛాయాతలంబు
లకుఁ దార్చి పేర్చినతమిఁ గట్టువాదిట్టమగలు వలరాచకయ్యంబులఁ దేలిం
చిన నెలవులఁ జెలువార నెరిసిన హారమౌక్తికంబు లని పొడవెన్నల లేఱం
బోవుసకియల వికావికనవ్వు నవ్విటీవిటులు దంతకాంతిప్రకాండంబుల దండి
చూపుచు, మునుపు ననుపుగల మగనియనువున ననయము ననునయించి
వెండియు నొండొకతె యండనుండఁ గని చేరి సారెకు దూఱి మగిడి చను
నెడ వెనుగదిసి ప్రియంబులు వలికి పదంబుల వ్రాలిన భర్తల నెగనెత్తి
మొగంబులు మగిడించి చేఁబట్ట నదలించి కరంబులు విదురుచు జగజంత
దగఱమగునల కంకణంబుల నంకితంబులైన హీరంబుల కాంతిపూరంబుల
నీరిక లెత్తుచు ననుంగుఁజెలుల వచనంబులు విని యన్యాంగనాసంగం బా
రోపించి క్రించుఁదనంబు గల్పించుకొని పొలయలుకల కలఁకల నునికి నిజ
ప్రాణనాయకులు మగిడి చనిన నిగిడిన నెవ్వగఁ బశ్చాత్తాపంబునుం బొంది
జాఱు కన్నీరు సారెకు నీటునఁ బోమీటు సారసాక్షుల గోరుల కాంతితీరు
చూపుచు, నొండొరువు లుద్దులు గూడుకొని తుఱుములు విరియఁ జిలుపచె
మటలు దొలఁక నలయికలు దలంపక గోడల నీడల నిజోరోజకుంభపరిమా
ణంబుఁ దెలుపువిధంబునఁ జెన్నగు వెన్నెలకుప్పలు వోసి యరయుటకుఁ
గడువడినడరు నీషన్ముక్తశైశవ లైనకప్పురగంధుల యురఃస్థలంబులఁ బింపిళ్లు
గురియు ముత్తియపుఁబేరులడాలుతోఁ బొత్తు గలియుచుఁ బ్రకాశించి య