పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]సీ.

బలిధామ మెనసినఁ బట్టి బంధింపడే చీఁకటి దళమేది చెదరెఁగాక
యడవులు బలసిన నడఁపదే నీడ ప్రకంపనాకులవృత్తిఁ గాంచెఁగాక
రాజు చేరినఁ గావరము మాన్పదే యంక మనినిశ్చితాకృతి యయ్యెఁగాక
దుర్గేశుఁ డంటినఁ దునుమదే యలకప్పు మదమేది కదలక యొదిఁగెఁగాక
రోదసీపూర్ణవిధుపాదరోచమాన, విమలధారావిశేషమై వెలయు దీని
మహిమచేఁ దూలవె యశేషమలినగుణము, లనఁగ వెన్నెల జగమెల్ల నాక్రమించె.

78

వెన్నెలవచనము

వ.

వెండియుం బుండరీకభవాండంబునం దండతండంబుగా నిండుపండువెన్నెల
[2]బిరుదుకస్తూరితోడఁ జుక్కలను జొక్కపుటరవిరులు వలగొన నునిచి తావి
గట్టిన నిశాకాంతుఁ డనుదంతపుబరణి నిర వగు తెల్లగందపడిఁ బగలు
గగనమణి నిగిడిచిన సెగలఁ బొడమిన బదలిక నడలి బిసకుసుమరసమును
జమరి పురరోదసియనుచెలువ [3]చలువ నెలకొన మైనెల్లఁ జల్లికొనిన మొల్లం
బున నుల్లసిల్లి మఱియు నాత్మీయనూతనదశాసముచితంబుగా శీతలతరశీతకర
శిలాతలంబులఁ బాఱిఁ జీరుకలాడుచు మందపవమానకందళస్యందమానేం
దీవరమరందధారాసందోహంబులం దేలి యోలలాడుచు నెల్లెడ వెల్లివిరియు
నుల్లోలతల్లజంబులఁ [4]బిల్లదీవు లాడుచు, నుత్ఫుల్లమల్లికామతల్లికావేల్లిత
పల్లకీకుడుంగంబులఁ గడంగి డాఁగిలిమ్రుచ్చు లాడుచుం బిసాళించి మ
ఱియు నలుకం గలయికలకుఁ దలపడని చెలువ [5]కీలితములు గిలుబందలంచు
చెలువున జాలకంబుకన్నంబులఁ బ్రవేశించి తలిరుగుమురుల నిరవగు నిరులు
విరియించు నెరవున నీరములసందులు దూఱి గగనావతరణశ్రమంబు నపన
యించువడువునఁ జంద్రశాలావిహారలోలబాలాకపోలఫలకంబుల నధివసిం
చి కవయెడలి యడలు జక్కవచెలువలయూర్పుసెగల నొగిలి [6]సెగమాన్పు
తెఱంగునఁ బుంభావసంభావనాపరిశ్రాంతకాంతాకుచాంతనిర్వాంతస్వే
దంబు లాని, మఱియు, నింద్రనీలమణిమయసౌధవిటంకంబులకు ధవళపారా
వతవ్రజంబై సావిగల తీవగుంపులకుఁ బూవుజొంపంబై కాసారతీరంబులకు
మించుగల యంచపిండై, బంగరుముంగీళ్లకు రంగవల్లికయై, మఱియుఁ గఱ
కుదొరతెఱంగునఁ దమ్ముల నొగిలించుచు, దైష్టికునిపోలిక దెసలు గడచుచు
భోగిపడువునఁ గడివోనిచలువలు దాల్చుచు నారదుని[7]వడువున జగడాలు

  1. ట-లో నీపద్యము లేదు.
  2. చ-గుఱుతు
  3. చలువ లలముకొన
  4. చ-బిల్లదిప్పాడుచు
  5. చ-నిశితములు నిలుపుండటంచు
  6. చ-జలమాను
  7. చ.రీతిని