పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఇనకరతాపతప్త యగునింద్రదిశాసతికాఁక దీఱ మో
మున నిడునూతనామృతసముజ్జ్వల మౌ పటికంపుగిండి[1]లా
గున నెలదోఁచెఁ దోఁచెఁ బయిఁగ్రొందొగ రప్పుడు నెమ్మితో [2]నిశా
వనిత మఱుంగుపట్టిన రువారపుఁజంద్రికపావడో యనన్.

72


మ.

తొలుగెంప న్నలఁ గింపుమై నలఁది తోడ్తోఁ బ్రాగ్దిశాతన్వి గ్రొ
న్నెలయన్ పాపని దానమార్ప మును గన్నీ రుబ్బెనా నూత్నర
శ్ములు మించెం బిడప న్విరుద్ధసలిలంబు ల్పర్వెనా వెన్నెలల్
నలువొందెం బయి దృష్టిబొ ట్టనఁగఁ జిహ్నం బొప్పె నీలద్యుతిన్.

73


సీ.

విధుఁ డౌట లోకైకవేద్యంబు గావింప శ్రీవత్సచిహ్నంబుఁ జేర్చె ననఁగ
సోమాభిధానంబు సువ్యక్త మొనరింప నఱుతఁ గప్పు ధరించి వఱలె ననఁగఁ
బద్మాసనుం డౌటఁ బ్రకటంబు గావింపఁ [3]గలహంసఁ జెంగట నిలిపె ననఁగ
ద్విజరాజవిఖ్యాతి నిజముగా నొనరింప హోమపావకరక్ష నూనె ననఁగ
నబ్జనామంబు సార్థమై యతిశయిల్ల, మత్తమధుపంబుఁ జెంత నమర్చె ననఁగ
నంకసంయుక్తుఁడై చెలువందె నపుడు, కమల[4]గర్వవిదారి రాకావిహారి.

74


చ.

నెలకొని రాజు తేజములు నించుచురాఁ గుముద[5]చారముల్
దళములు విచ్చియుం బొగడుదాల్చె దళంబులు వేయి గూర్చియున్
విలసన మొంద వయ్యె నరవిందగణంబు లినుండు నిల్వమిం
దలఁప బలప్రచారములు ధారిణి నీశ[6]ణానురూపముల్.

75


చ.

విరహులపైఁ గరాస్త్రములు వే నిగిడింపఁ గడంగి కందు చ
క్కెరవిలుకాఁడు నెక్కసపుఁగిన్క దొలంక మృగాంకబింబమున్
విరివిలుచుట్టుగాఁ దివియ వేమఱు రాలు తేదీయసీధుశీ
కరములకైవడిం దొఱఁగె గాఢతుషారతుషారవారముల్.

76


సీ.

కలువకొప్పెరల జక్కవయూర్పు సెగఁ గ్రాఁగు నులివెచ్చ[7]పూఁదేనె జలకమాడి
తఱినిండుజాబిల్లి తళుకుబొక్కసములోపల మించువలిమంచు[8]వలువఁ బూని
విరిబొండుమల్లెపూబరణులనెత్తావి జడియు పుప్పొడిగందవడి యలంది
[9]చిలుకునీరు దొలంకఁ దెలివొందు నెలచట్టు పళ్లెరంబులమ్రోల బంతి సాఁగి
యలరుఁ బొదరిండ్ల ముంగిళ్ల వలఁపుకలన, [10]నలయు జవరాండ్ర క్రాల్గన్నుచెలులఁ గూడి
పండువెన్నెలచిలువాలపాయసంబు, లారగించెఁ జకోరరాజాన్వయంబు.

77
  1. చ-ట-బాగున
  2. క-దిశావనిత
  3. చ-నలహంస
  4. చ-గర్వాపహరి
  5. చ-ట-ప్రతానముల్
  6. ట-రణానురూపముల్
  7. చ-ట-పూనీట
  8. చ-చలువ లూని
  9. ట-చినుకునీరు
  10. చ-నలరు