పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూరిభీకరభాంకృతు ల్పొదలఁ గొన్ని
పొదల నడుచక్కి బెబ్బులి గదిసె నొకటి.

39


క.

ఆపులి నిజతురగదిదృ, క్షాపరత న్నిగుడ దాని ఘనపరుషరుషా
చాపలతం దూపు భుజా, చాపలతం దొడిగి శౌరిసంభవుఁ డడిచెన్.

40

చంద్రికాపరిణయము - ద్వితీయాశ్వాసము

సీ.

అఖిలజంతునిఖాదనారూఢిమైఁ బోలె నతివివృతంబైన యాస్య మమర
నాశేభములఁ జీర్పనట్టి సిబ్బితిఁబోలె నతిగన్ననఖరసంతతి వెలుంగ
స్వమృగహింసావిహారముఁ గాంచురతిఁబోలెఁ దలపై నెగయు వాలదండ మొనర
నిగుడుకోపాంకురనికరం బగుటఁబోలె సితకేసరములకెంజిగిఁ జిగుర్ప
వక్రదంష్ట్రలు శతకోటివాదు గెలువ
వర్తులపుఁగన్నుఁగవ భానువాసిఁ గేర
ఘుటఘుటార్భటి ఘనకోటిపటిమఁ దెగడ
నొక్కసింగంబు వడిఁ బొదనుండి వెడలె.

27


క.

వెలలి జిఘృక్షాగౌరవ, కలనన్ లంఘించునృపతిఁ గల్గొని నిజని
స్తులచంద్రహాసధారం, దల ద్రెవ్వఁగ నేసె నద్భుతంబుగ నంతన్.

28

ఇట్టిపోలిక లనేకములు గలవు గాని గ్రంథవిస్తరభీతి నిట నుదాహరింపలేదు. ఇట్టు లీయుభయగ్రంథములకు సాదృశ్య మున్నను వైదృశ్యము గూడఁ చాలఁ గలదు. మల్లన తఱచుగా వర్ణనములందు మనుచరిత్రము ననుకరించి మృదులమృదులము లగు పదముల నేర్చి కూర్చువాఁడు. మాధవరాయఁ డన్ననో వసుచరిత్రానుకరణుఁడై శ్లేషాద్యలంకారముల గుప్పించుటకై కొంచెము క్లిష్టపదప్రయోగము గావించువాఁడు. మల్లనకవియు శ్లేష నతిమాత్రముగ నుపయోగించెను. పదకాఠిన్యమున కంతగా సహించువాడు కాఁడు. మాధవరాయలు పదలాలిత్యము నాలోచింపక శ్లేషాద్యలంకారగరిమకే ప్రాధాన్య మిచ్చువాఁడు. మల్లనకుఁ గథాభాగ మధికముగా నుండుటయుఁ గార్యవశమునఁ గొంచెము కొంచెముగా వర్ణనలఁ బెంచుటయు నభిమతము. మాధవరాయనిగ్రంథమందుఁ గథాభాగ మత్యల్పమైనను వర్ణనలచే గ్రంథము పెంచఁబడినది. ఈయిరువురుకవులు నసాధారణపాండిత్యప్రకర్ష గలవారు. శాస్త్రమర్యాదలఁ జక్కఁగ నెఱింగినవా రనుటకు వారిప్రయోగములే ప్రమాణము. ఇతరగ్రంథములందుఁ గానరాని సంస్కృతపదములు వీరిగ్రంథముల దగపడును. మల్లన తఱచుగాఁ గర్ణాటాదీతరదేశ్యపదములను బ్రయోగంప నలవాటు పడినవాఁడు.