పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17


వెన్ను డాకన్ను తమిఁదమి విడక మున్న
దినదినమ్మును నచట నుదీర్ణ పర్ణ
శాలికామాలి కాళింద సరణి నరణి
మత్కుల కులాంగనలకు సమ్మదము [1]పొదల.

7


మ.

శుకముల్ ప్రామినుకుల్ గుణించు గణియించున్ ధర్మమర్మేతిహా
స కథల్ శారిక లీరికల్ గొనుమనీషన్ శేషభాషావిశే
ష కళాశాస్త్ర ముపన్యసించు [2]పికముల్ సాత్రాజితీప్రాణనా
యక నామాళి వళుల్ పఠించు [3]సతతోద్యద్గీతికాచాతురిన్.

8


క.

ఒక చిత్ర మచటి[4]జటిపా
ళికి మున్ సంజలను గ్రుంకి లేచి సమాధిన్
సకలశకుంతంబులు తా
రకమంత్రోచ్చారణాభిరతి మతిఁ బొదలున్.

9


ఉ.

అమ్మునిబాలకుల్ ఫలదశాదులకై వనిజుట్టుచో నహీం
ద్రమ్ములు చేరి యెండకు ఫణంబులు చాటుగఁ జేయ నంతలో
నెమ్ములు వచ్చి సాములకు నే మొనరించిన నేర మేమి న్యా
యమ్ములె [5]మీపనుల్ దలఁప? నంచు దరిం [6]బురివిచ్చు నీడగన్.

10


మ.

పులు [7]లేదున్ మృగశాబకంబుల హరుల్ పోషించు నత్యాదృతిన్
కలభానీకముఁ గాకముల్ మెలఁగు ఘూకశ్రేణితోఁ బిల్లు లె
ల్కలఁ గాచున్ శిఖికోటి లేఁ [8]జిలువలన్ లాలించు [9]నుత్ఫుల్లబ
ర్హ లసచ్ఛాయలనుంచి యచ్చటియరణ్యానీప్రదేశంబు[10]లన్.

11


క.

ముని హోమానల ధూమము
వినువాకం గ్రుంకి వెడలు విబుధవధూటీ
జనముల నెఱిముంగురులం
దనరున్ [11]సాంబ్రాణి ధూపధారారీతిన్.

12
  1. మొదవ. తా.
  2. బకముల్. పూ. ము.
  3. సవతో
  4. బేటి పటరికమున్. తా.
  5. మా.
  6. బారివచ్చు. తా.
  7. లేడున్. తా.
  8. జలువలున్ తా.
  9. నద్భుల్ల జర్హ. తా.
  10. నన్. తా.
  11. సామ్రాణి. తా.