పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/94

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఘటికాచలమాహాత్మ్యము


ఉ.

వావిరి ఖండొజిప్రభుఁ డవామకరంబున హేతిఁబూన యు
ద్ధావని ధావనం బిడి హితావళితోడను పుట్ట లెక్కఁగా
నావలిభోగివల్లభులమైతిమటంచుఁ దృణంబు లెక్కఁగా
గోవరులైతిమంచు [1]ననుకొందురు శాత్రవు లాత్మసంపదన్.

47


సీ.

మహనీయధామసామగ్రితో గృహదాన
ములు చేసె బ్రాహ్మణావళులకెల్ల
త్రవ్వించె బలిరసాతలముదాక తటాక
ములు నీరుదీయక నిలచియుండ
వేయించె శీతలచ్ఛాయానపాయాభి
రామ[2]ద్రుమావృతారామసమితి
కట్టించే శైలప్రాకారానుకారప్ర
కారసంతతులతో మీఱ గుళ్లు
కనియె తనవంటితనయుని గాంచెఁ గృతులు
నట్లనేకసంతానసంఖ్యలు గడించి
యీ యవని బొల్చు ఖండోజిరాయధీరు
కేకసంతానయుతుఁడైన యింద్రుఁ డెనయె?

48


చ.

మలసి నిదాఘవేళలను మాపు వెలార్చిన తత్ప్రపాజలం
బుల వరిమళ్లలోఁ బొడముపుల్లు భుజించు ఘటోధ్నికాచయం
బులు పరిశుద్ధపాత్రపరిపూర్ణసువర్ణపయస్సు లిచ్చు ను
జ్జ్వలగతి ఖండొజీంద్రువలె [3]సజ్జనవిత్తము రిత్తవోవునే?

49


సీ.

పొంది యబ్ధులు గట్టుపొర్లివచ్చినగాని
[4]కేరిధూర్తత నొకతూరిచల్లు
సురపథం బొకవేళ సోలివ్రాలినగాని
క్షితి ఱాఁగయై యరచేత నొడ్డు
తుహినాచలేంద్రంబు దొర్లివచ్చినగాని
గడుసుగయ్యాళియై కాలఁదన్ను

  1. నని కొందరు. తా.
  2. దృఢా. పూ.ము. దృతా-తా.
  3. సజ్జనుద్రవ్యము రిత్తబోవునే. తా.
  4. ధూర్తమై యొక కేరితూరిచల్లు. తా.