పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/93

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

11


డైన నిజధర్తతోడ నొయ్యనచరించు
కాంతలకు మేటి భాగాంబికావధూటి.

42


ఉ.

కొంతనిగాదు బాలతొడుగుల్ మడుగుల్ సువర్ణముల్
దొంతిగ నుప్పుతోఁగలుగు తొమ్మిదియుంగొని యేటి కేటికీ
వంతుగ నాపెచే మననివారలులేరు నిజంబుగాఁ దదా
నీంతనమైనయట్టి ధరణీజనజాలములోన నెన్నఁగన్.

43


క.

ఆ భాగాంబాశచికిన్
శోభిల్లు విచిత్రరాయసుత్రామునకున్
శోభాఖని ఖండోజిమ
హాభాగుఁడు [1]వొడమె నల జయంత స్ఫూర్తిన్.

44


సీ.

పుట్టినప్పుడె పూర్వపుణ్యశేషంబునఁ
బుట్టించె బుధుల కద్భుతముదంబు
అడుగుబెట్టిననాఁడె యతులతేజస్ఫూర్తి
[2]నడుగువట్టించె ఖలాంధకార
మమ్మమ్మ యనునాఁడె యాకారగరిమచే
నమ్మమ్మ యనిపించె నఖిలజనుల
పలుక నేర్చిన నాఁడె ప్రతిమలౌ వేల్పులఁ
బలికించె నాత్మీయభక్తి మహిమ
పలుకబట్టిననాఁడె రూపప్రభావ
భావనమ్మున [3]కామినీపంఙ్తిచేత
పలుకబట్టించె సజ్జనకులవిహారి
రాధితమురారి ఖండోజిరాయశౌరి.

45


చ.

కలితగుణాభిరాము డగు ఖండొజిరాయని బాహుపీఠిపై
బొలుచు ప్రతాపసిద్ధుఁడు విభుత్వవిభూతి నొనర్చు పారద
చ్ఛలఘటికాపరంపరలచాడ్పునఁ దచ్చిరకీర్తిచంద్రికో
జ్జ్వలబహిరంతరంబుల[4]న వర్తిలు నంబుజసంభవాండముల్.

46
  1. వొడమెన్ జయంతభాగ్యస్ఫూర్తిన్ - పూ.ము.
  2. ఈ పాదార్ధము తాళపత్రమున లేదు.
  3. సన్ముని - పూ. ము.
  4. యి. తా.