పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

4

ఘటికాచలమాహాత్మ్యము


శా.

ఓ ఖండోజివిచిత్రరాయ విను నీవొక్కండుదక్కంగ నా
శ్రీఖండాచల శీతలాచల ధరాసీమాబ్ధిరాణ్మేఖలా
లేఖాధీళులలోన కావ్యసుమనోలీలాసుగంధప్రయో
గాఖండీకృతమానసుల్ దొరక రాహా మందుకైనన్ మహిన్.

13


చ.

భువిని విచిత్ర క్సరణిఁ బొల్చిన తెన్నలిరామకృష్ణ స
త్కవికులవజ్రపాణి ఘటికాగిరినాథమహాచరిత్రమున్
సవరణగా రచించి కృతిసంతతికన్యక కెన్న యోగ్యుఁడై
ధవుఁడొకరుండు[1]లేమికిని తామదిలోన వితాకుఁ జెందుచున్.

14


సీ.

పొలుపేది పుట్టులోభులపాలు చేసిన
పశుమూల్యమాత్రంబు ప్రాప్యమనుచు
మూఢాత్ములైన కాముకుల కర్పించిన
నెనరుతోఁ బాలింప నేరరనుచు
ఎదిరిఁ దన్నెఱుఁగని హీనుల కిచ్చిన
వసుమతి నపకీర్తి వచ్చుననుచు
మత్సరగ్రస్తపామరుల కీఁదలఁచిన
విడువక నొలమూల వేతురనుచు
వెంచి కృతికన్య నింటనే యుంచె నాతఁ
డాతనియభీష్టసిద్ధి నేఁ డయ్యె ననుచు
నిన్ను విని తెచ్చినాఁడ నా నిరుపమాన
కావ్య మిది కొమ్ము భాగాంబికాతనూజ.

15


గీ.

అనుచు నొసఁగినఁ గైకొని యతని యిష్ట
సిద్ధిఁ గావించి [2]సంతుష్టసిద్ధుఁ డగుచు
నన్ను రావించి యర్ధాసనమున నుంచి
పలికె నుదమేఘగంభీరభాషణముల.

16


మ.

పదసందర్భవిశుద్ధి ప్రౌఢతరశబ్ద క్రియాబుద్ధి పా
రదగంభీరచతుర్విధప్రధితధారాసిద్ధి ప్రాపించి [3]సం

  1. లేమికిని తా, తా లేమిగని. పూ. ము.
  2. సంతుష్ట
  3. సంసదభిద్యద్విభుధావలిన్ వినుతి నెచ్చన్. తా.