పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


లయినది ఈ మూడుకృతుల లోను ఘటికాచలమాహాత్మ్యమున కొక విశిష్టత యున్నది. అవి ఆ గ్రంథముజాతకమ నుబట్టి వచ్చినది మిగికిన రెండు గ్రంథములను రామ(లింగ) కృష్ణుడే స్వయముగా దేచమంత్రికిని 1[1] వేదాద్రి మంత్రికిని 2[2] అంకితము చేసి నాడు. ఈ ఘటి కాచలమాహాత్మ్యము నెవరికిని ఆయన ఇయ్యలేదు. కొందరభిప్రాయ పడుచున్నట్లు పాండుగంగమాహాత్మ్యమును రామకృష్ణుడు తన చరమదశలో రచించినచో [3]3 తానంతకుమునుపు రచించిన ఘటికాచలమాహాత్మ్యము నట్లేయుంచి కొత్తగా పాండురంగ మాహాత్మ్యమునువ్రాసి వేదాద్రి కంకితము చేసి నాడని చెప్పవలయును. అతనికే ఈ వైష్ణ వగ్రంథ మేల ఇచ్చియుండ లేదు? ఆయన కాకపోయిన ఆమాత్రము కృతి పుచ్చుకొను వాడే నాడు రామకృష్ణునకు లభింప లేదా? దానినిన రాంకితము చేయుటకు రామకృష్ణున కిష్టము లేదా అన్నచో రెండు గ్రంథములను నరాంకితములు చేయనేచేసెను గదా! అట్లు గాక ఘటికాచల మాహాత్మ్యము రామకృష్ణుని తొలి కృతి అనియు దానియం దాయనకే అంత ఆవసరములేక మూల పార వేసి నాడన్నచో అదియు నంతగా పొసగదు. అట్లగుచో రామకృష్ణుడు మొదట వైష్ణవుడుగా ఉండి ఘటికా చలమాహాత్మ్యము

వ్రాసి, శైవుడై ఉద్భటారాధ్య చరిత్రమును వ్రాసి , తిరిగి వైష్ణవుడై పాండు రంగమాహాత్మ్య మును రచించినాడని చెప్పవలసివచ్చును. ఇది వట్టి అసం దర్శము. ఇక మిగిలినది - పాండురంగమాహాత్మ్యమును రచించి వేదాద్రి కంకితము గావించి, చరమదశలో ఘటి కాచలమాహాత్మ్యమును రచించి దాని నెవరికిని కృతి యియ్యకుండగనే రామకృష్ణుడు పరమపదించియుండు ననుట దీనికిట్లు శంకను చూపవచ్చును. గ్రంథరచనా భ్యాసము పెరుగు కొలది ప్రతి భావ్యుత్పత్తు లలో ప్రౌఢిమ, సాంద్రత గోచరింపవలయునుగదా? అన్ని విధములను ఉద్భటారాధ్య చరిత్రమున కంటె పాండురంగ మాహాత్మ్యము పై చేయిగానున్నది - అట్లే మటి కాచలమాహాత్మ్యము పాండు రంగమాహాత్మ్యమును మించి యుండవలయును కాని లేదు. మరి దాని సంగతి యేమియని నిజమే. ఘటికాచలమాహాత్మ్య ము పాండురంగ మాహాత్మ్యమునకు తీసికట్టే. వయసుముదిరి రెండవ బాల్యము పై కొన్నప్పుడు ప్రతి భావ్యుత్పత్తులు రెండును మందగించును ఆ మందగించిన

  1. 1. ఉద్భటారాధ్య చరిత్రము.
  2. 2 పాండురంగ మాహాత్మ్యము
  3. 3 పాండురంగ మాహాత్మ్యము - శ్రీ బులుసు వేంక టరమణ య్యగారి పిఠిక. పుట 13.