పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/201

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

121


ఆ.

[1]హోమపూర్వకముగ నుత్తుంగగరుడకే
తనపటంబు నెత్తి తాళమాన
విధము తప్పకుండ వివిధవాద్యంబులు
మొరయఁజేయు తదవసరము నందు.

62


క.

పరివారసహితముగ పుర
హరుఁడును కమలోద్భవుండు దిశాధిపతులు స
త్వరమున సహవాహనులై
స్థిరకుం జను దెంచి రానృసింహుఁ గనంగన్.

63


సీ.

కనకకుంభము లెత్తి కరిరాజయుగ్మంబు
నినుచు తీర్థము లాడు నీలవేణి
వెన్నెల నొరవెట్టు వెలిపట్టువస్త్రంబు
జోకగాఁ గట్టెడు లోకజనని
అలినీలములనొప్పు నబ్జాసనమ్మున
కొలువుండు గురుకుచకుంభయుగళ
నెత్తమ్మిరేకుల నిరసించగాఁ జాలు
సోగకన్నులుగల శోభనాంగి
ఇందిరాదేవి యా జగదీశు నెదుట
నిలిచి మంగళాష్టకముల [2]యులివు సెలఁగ
చిత్రకరమైన తెర[3]యెత్త చేతులెత్తి
హరికి తలఁబ్రాలు [4]వోసె నయ్యవసరమున.

64


సీ.

కౌతుకబంధముల్ ఘటియించి నెఱిమించి
భూరివాద్యంబులు భోరుగలుగ
మొనసి ముక్తాఛత్రములు మిన్నుముట్టంగ
భాగవతుల యాట పాట లమర
నాగమస్తుతులు గాయక గానములు నొప్ప
నంబుజాసనల నాట్యములు ధనర

  1. హేమ. తా.
  2. యలవు. తా. నెలవు సేయ. పూ. ము.
  3. యెత్తి. తా.
  4. నించె. తా. ము. తా.