పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/197

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

117


గీ.

వేగవతి యుత్తరపుదరి వెలయు హస్తి
గిరి నజుని యజ్ఞవేదికాపరిసరమున
దనరు పుణ్యకోటివిమానమున వసించు
వరదుఁ డాత్మీయభక్తుల వరము లొసగు.

44


క.

ఇచ్చోటుల వసియింతురు
సచ్చరితులు బుధులు సత్యసంధులు పెక్కం
డ్రెచ్చో నేమూ ర్తి భయం
బచ్చో నామూర్తిఁ గొలుతు రనుపమభక్తిన్.

45


వ.

విశ్లేషించి యీ ఘటికాచలంబు సకలజనప్రశంసనీయం బని వసి
ష్ఠుండు బల్కుటయు నమ్మును లమ్మునీంద్రచంద్రుంబూజించి స్వామీ
యిందు విషమప్రదేశంబున మేముండుట యెట్లు సిద్ధించు నుపాయం
బుగల దేని యాన తిమ్మననుటయు వసిష్ఠుండు వారల కిట్లనియె.

46


గీ.

ఇమ్మహీధ్రమ్మునకు చుట్టు నెవ్వరేని
సమతలంబుగఁ జేయంగఁ జాలిరేని
యిందు మీరు సుఖంబున నుందు రనిన
వారు శ్రీనరసింహునిఁ జేరి మ్రొక్కి.

47


సీ.

శిరములు కన్నులు [1]చెవులు కాళ్లు
చేతు లసంఖ్యముల్ జెంది త్రిభువ
నేశుఁడవై బ్రహ్మవై శక్రరూపివై
యఖలదేవాకృతి నలరి తీవ
రూపదీపితుఁడ వరూపుఁడ వఖలస్వ
రూపుఁడ వీవ సంప్రాపకుఁడవు
అసమాక్ష[2]ముఖ్యులు నీయాజ్ఞ దాటంగలే
రితరు లెఱుంగుట కెంతవారు
పాకశాసనముఖ్య దిక్పాలవరులు
శాశ్వతైశ్వర్యులైరి నీ సాంద్రకృపను

  1. చెవులు(చెక్కులు).
  2. ముఖులు. పూ. ము. తా.