పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

89


బీశౌరికరుణ గురు వా
గీశ ఫణీశులకు నైన నెన్నందరమే?

193


ఉ.

ఏమితపంబొనర్చితిమొ యేసుకృతంబొనరించినామొ యే
నోములునోచినారమొ మనోరథముల్ మది దైలువారఁగాఁ
గామిత దానపాటవముఁ గల్గినతండ్రిని వేంకటాచల
స్వామినిఁ జూడఁగంటిమి శుభమ్ములుగూడ నఘమ్ము లూడఁగన్.

194


సీ.

అనుచు లోననుచుమహానురాగమ్మున
[1]దనిసిపల్కుచు గిరీంద్రమ్ము డిగ్గి
తద్ధక్షిణమున విధాత కమండలు
నాళంబు వెడలు స్వర్ణది తెఱంగు
భూరి[2]తటోద్గతిఁ బొలుపొంది యఘహర
వారియౌ నయ్యాళువారి తీర్థ
మటఁగాంచి స్నానములాడి కౌశికదిక్త
టాంచల వసదనలాక్షుఁ గొలిచి
భక్తి గోవిందరాజులఁ బ్రణుతిఁ దేల్చి
యా యచలసార్వభౌమునిఁ బాయలేకఁ
బెనఁగునాలోకనముల నొయ్యన మఱల్చి
మినుకుటందియదోయిసామినిఁ దలఁపుచు.

195


గీ.

నారికేళ రసాల జంబీర పనస
మన్మధ మధూక సాల రంభా వనములఁ
గనకకాంతులఁ బర్వెడు కలమ సస్య
ములనుఁ బొలుపొందు జనపదమ్ములను దాటి.

196


సీ.

శ్రీకరానేక రత్నాకర ప్రాకార
గోపుర ప్రాసాద దీపితంబు
సౌధాగ్ర సంచర జ్జలజముఖీ ముఖ
మణిదర్పణిత చంద్రమండలంబు

  1. దనరి. పూ. ము.
  2. తమోద్గతి. పూ. ము.