పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఘటికాచలమాహాత్మ్యము


క.

శ్రీకాకులవల్లభుని ని
రాకులమతిఁ బూజ జేసి యా హరిదయఁజొ
క్కాకుల జోకన్ [1]డుల్లం
గా కర్మములెల్ల హర్షకలితాత్మకులై.

169


క.

[2]అల మును లెదుటం గాంచిరి
కలహంసీమధురవాణి కమలజపాణిన్
బులినశ్రోణిన్ ధృతశై
వలవేణిన్ గృష్ణవేణి వారిధిరాణిన్.

170


ఉ.

అన్నది చెన్ను కన్నులకు [3]నామని సేయ గృతావగాహనో
త్పన్నమహాప్రబోధరసపారగులై మఱి వార్ధిపొందుగై
కొన్న యనేక వాహినుల గోరిక లీరికలెత్త గ్రుంకుచున్
వెన్నునికిం దివాణమగు వేంకటశైలముఁ జూచి వేడుకన్.

171


చ.

చనిచని కాంచి రా దివిజసంయములందఱు ముందఱన్ గన
త్కనక మణిప్రభాజనకధాతు గుహాతటశృంగసాలమున్
జనజనిబంధనేంధనధనంజయదంచిత తీర్థజాలమున్
సనకసనందనాది మునిసంస్తుతశీలము శేషశైలమున్.

172


వ.

కాంచి తదుదంచితస్థితికి హర్షించి యమందానందకందళితహృద
యారవిందులై మునిపురందరు లందఱందంద వందనంబులాచ
రింపుచు తత్కుధరారోహణంబు గావించి చనిచని ముందఱ నర
విందబృందతుందిల మకరంద కణాసార సంభూత సౌరభోద్వేలం
బును తాలహింతాల తమాల రసాలసాల తిలక తిందుక ఘనసార
ఖర్జూర జంబీర కర్పూర కదళికా కదంబకుంద చందన మందార
పున్నాగ పూగ నాగకేసర సరళ మన్మథ మధూక పనస పాటల
పారిభద్ర బిల్లు బిల్వాది సలలితోద్యానవనవిశాలంబును నుత్ఫుల్ల
హల్లక కుముద కువలయ వలయవీథికాసంచరన్మధుకర మధుకరీ
ఝంకారానుకారి ఘుమఘుమారావ తుములకల్లోలమాలికా
కేళికాలోల మరాళ గరుత్పటలజానిలోద్దూత శీకర శరాసారస్థగిత

  1. కడులన్. తా.
  2. అలమున. తా. అలయమున. పూ. ము.
  3. నామతి. పూ. ము. తా.