పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/150

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

69


[1]కినియుచు గోసితె గేదఁగి పువ్వులు
వనితరొ నాతో వలదే నవ్వులు
[2]బొండు మల్లెల కె పొలఁతిరొ ముచ్చట
మిండతుమ్మెదలు మెలఁగెడు వచ్చట,
[3]గన్నెరు పూలకుఁ గన్నెఱ సేతురె


[4]పలుకకె చిలుకలు బారులు దీరెను
[5]జళుకకువే నీ సరసత మీఱెను
చెలి విరిగుత్తులు చిదుమగ నీ యలి
కలికి పఱచె నహహా యది వెంగలి
యనుచు ననుచు మది నందఱ గూడుక
వనితలు తమలో వదలని వేడుక
తేనియ కాల్వల దెప్పల దేలుచు
సూనాసవముల సొక్కుచు సోలుచు
కలరవకులముల కైవడిఁ బలుకుచు
కలహంసల నగు గతులను గులుకుచు
పుప్పొడి తిన్నెల పొలుపుగఁ బాడుచు
కప్పుర పనఁటుల కదలిచి యాడుచు.

114


గీ.

కుసుమహరణేచ్ఛఁ జాలించి కుసుమశరుని
శాతబాణంబులనఁగ రంభా తిలోత్త
[6]మాది ముఖ్యాప్సరసలు సమ్మదము మదుల
బొదల నచ్చోటు వాసి యా మునుల డాసి.

115


క.

దగ్గర బోరా దగ్గికి
వెగ్గలమై యున్నదౌర [7]వీరల తేజం

  1. కినిసి. తా.
  2. పూర్వార్థమున ఛంధోగతి విచార్యము.
  3. ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు. తాళపత్రప్రతిలో గూడ నీ రగడ సంపూర్ణముగా లేదు.
  4. ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు. తాళపత్రప్రతిలో గూడ నీ రగడ సంపూర్ణముగా లేదు.
  5. ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు. తాళపత్రప్రతిలో గూడ నీ రగడ సంపూర్ణముగా లేదు.
  6. మాముఖ్యాద్యప్సరసలు. తా.
  7. వీరుల. తా.