పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

67


మెరసి చనుట మొన[1]గాండ్రకు
స్థిర మున్నతిమీఁద నున్నతియుఁ గల్గుఁగదా!

107


క.

రాచిలుక పండ్లు [2]గొఱుకుచు
నేచిన కోపమున వదన మెఱ్ఱఁగఁ జేసెన్
జూచితివే చెలి? తనభా
షాచతురత నీదు పలుకుసాటికి రామిన్.

108


గీ.

వలపు కానుక సేయు పూవులకు నూరు
పులును పుప్పొడి చల్లు తీవలకు హస్త
మూలకాంతులు కరముఁగబొలిచి రబల
లగునె యన్యోన్యబంధుకృత్యమ్ము లెందు.

109


గీ.

చిలుక పోటుల జీరలచేఁ జెలంగు
దాడిమఫలమ్ముఁ జూచితే తరళనయన!
విటుని [3]నునుగోటితాకులఁ [4]బేటు లెత్తు
గబ్బిసిబ్బెంపుబిగిచన్నుగుబ్బవోలె.

110


సీ.

అనయంబు మాటదాటని చిల్క[5]పల్కుల
ఫలభంగములు సేయఁ బాడి యగునె?
యొకకుత్తుకై యుండు పికనికరమ్ముల
లేఁజిగుళ్ళకుఁ బాప నోజ యగునె?
నడకలో బెఱుకింత వొడమకఁ జరియించు
రాయంచల నలంచ నాయ మగునె?
కన్నుసన్నల మెలఁగఁగ నేర్చు వెన్నెల
పులుగుల సిలుగుల నలచ నగునె?
తగుల మెన్నక యీవగ పొగరు వగల
నగడు గావింప నవి తమకజ్జయైన
యెడల గొడవలఁ బెట్టక [6]యేల వలదె
కలదె యీచింత యచ్చరకాంతలార!

111
  1. గాళ్ళకు. తా.
  2. గోరుచు. తా.
  3. నిను. తా.
  4. నలరుకులట. పూ. ము. తా.
  5. దాటుల. పూ. ము.
  6. యుండ. తా.