పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/144

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

ద్వితీయాశ్వాసము


పాతాళనాగ కాంతాతనుశ్రీలను
నింపొందు జడచే జయించు ననియు
నిఖిలసత్కీరవాణీవిలాసస్ఫూర్తి
కలికి పలుకులనే గదుము ననియు
కాదె యీకాంత కెంతయు కంతు డంద
మొంద త్రైలోక్యసుందరీబృందరూప
గురుతిరస్కారసూచన బిరుద మొసఁగె
వాలు నునుజూపు బేడిసడాలు పేర.

92


క.

ఈపడతుకఁ గని మదనుని
తాపంబును బొందకుండ ధాతకు వశమే?
బాపురె! యని సుర లెన్నఁగ
నా పైదలిఁ జూచి వజ్రియనియెన్ బ్రీతిన్.

93


చ.

ఘనకుచకుంభ! రంభ! యొకకార్యము వార్యము మద్భుజాతటా
గ్రనిశితవజ్రధారకును గావున నిన్నిటుఁ బిల్వఁబంచితిన్
మునులు వసిష్ఠముఖ్యులు తపోనియతిన్ శతకూటపర్వతం
బున ధృతినున్నవారు జగముల్ తపియితపఁదపోగ్నికీలలన్.

94


గీ.

వారి నేడ్వుర వలరాచవారి బారి
వారి గావించి గర్వపర్వతము ద్రుంచి
వచ్చినప్పుడె మెచ్చునీవలయు [1]జాడ
నిచ్చువారము పనివిను మిపుడె కదలి.

95


చ.

అన విని యోసురేంద్ర! భవదాజ్ఞ తలం ధరియించి యానగం
బున జరియించు మౌనుల తపోనియమంబు కలంచి [2]ధ్యానభం
జన మొనరించి మౌనవిరసత్వమునించి జపంబుమాన్చి క్రొ
న్నన విలుకాని మంత్రములు నాలుకలన్ లిఖియించి వేడుకన్.

96


గీ.

[3]తాళవృంతంబు నిలువుటద్దంబు కుంచె
పసిడికాళంజి కపురంపుపైడిగిండి

  1. జూడ. పూ. ము. తా.
  2. ఇటనుండి పద్యము పూర్వముద్రణమున లేదు.
  3. ఇటనుండి కాళంజివరకు పూర్వముద్రణమున లేదు.