పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

59


పలక మగరాలరతనపు
కళుకుల మొలనూలి చిరుతగంటలు మ్రోయన్.

77


క.

కనకస్తంభస్తంభన
జనకములై హస్తిహస్తసారహరములై
యనఁటుల మీఱెడి యూరుల
మినుకులు మిన్నెల్లఁ [1]బర్వి మిలమిలలీనన్.

78


గీ.

మంజుశింజిత మంజీర కంజరాగ
రత్నరుచి త్రోవకును రాగరసము నింప
మెల్లమెల్లన నడచునో [2]మెట్టెదోయి
కదలి ఘలుమల్లుమని తాళగతుల [3]మొరయ.

79


ఉ.

కీరమొ? కాక చిల్కతురికీదొరరాణిధరించు మౌక్తికా
హారమొ? పాకజిజ్జియవిహారమొ? [4]పార్వణచంద్రచంద్రికా
సారమొ? చంచలారుచులసారమొ? యౌర! యటంచు చూపరుల్
సారె నుతింప నంచనడలన్ సకివచ్చె బలారిచెంతకున్.

80


క.

వచ్చిన యచ్చరఁజూచి వి
యచ్చరులచ్చెరువునొంది యతనుని శరముల్
విచ్చలవిడి వడి గాడఁగ
నచ్చెలి చెలువంబు వొగడి రతిమోదమునన్.

81


సీ.

పులుదిండిఱాల సొంపులునింపు నెఱికురుల్
తేగడ నెలవంక దిద్దునుదురు
రేక చీఁకటిమూక సాకు కన్బొమ్మలు
కలువల వలపించు కన్నుదోయి
సంపెంగయలరువాసన కాసయగు నాస
చికిలియందఁపు ముద్దు చెక్కు దోయి
సావితేనియ బావిదీవియౌ కెమ్మోవి
మొల్ల మొగ్గల వెదజల్లు రదము

  1. పన్ని మిన్నలనీనన్. తా.
  2. మెట్టి. పూ. ము.
  3. మెరయ. తా.
  4. పార్విక. తా.