పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/137

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ఘటికాచలమాహాత్మ్యము


సంచత్కాంచనరంభాస్తంభగంభీరప్రజాప్రవాహంబుజారు నూరు
యుగళంబును [1]చిరత్నరత్నప్రభాంచితకాంచనమేఖలా పరివృతా
చలనితంబప్రత్రిబింబం బగునితంబంబును నంబుజాత [2]తనూజాతునకు
మాతయైన నెత్తమ్మికిం బోల్కియై మిక్కుటంబైన పొక్కిలి
యును సురగరుడోరగ కిన్నర గంధర్వ సిద్ధ సాధ్యఖేచర చారణ
విద్యాధరాదులు సంచరించునంబరంబు మధ్యంబుగాఁ జేయు మధ్యం
బును వైజయంతీలలంతికాకమలకౌస్తుభరత్నశ్రీవత్సవిరాజితం
బగు వత్సంబును దర్పితౌద్ధత్యదైత్యదానవచ్ఛిదావినోదకరంబు
లయిన కరంబులును నిజదాసజనావనాభిముఖంబయిన ముఖం
బును నవార్య మాధుర్యం బయిన మావిలేఁజిగురు నధరంబుగాఁ
జేయు నధరంబును నాయతంబగు జాంబూనద హ్రదంబు సోయగంబు
నకుఁ [3]దావకంబై యున్న యున్నతనాసయును నరవిందేందిర
[4]కొక వింతకాంతిఁజూపు చల్లనినిడువాలుజూపులును నెక్కువ
కళలుజిందు నిందుఖండంబులంజెక్కివైచు చొక్కంపు చిక్కిలి
లేఁజెక్కులును నూతన కైతక గర్భదళ [5]విభాళంబయిన
ఫాలంబును చిరత్నరత్నఖచితోదారకోటీరప్రభాంగంబై రంగుమీఱు
నుత్తమాంగంబును గల యిందిరాసుందరీమనోహరుండగు హరిని
నానందంబుతో డెందంబునంబొందుపఱచి చంచలతయు వేసటయు
లేక తపంబు సేయునయ్యవసరంబున.

68


సీ.

పగడంపుమంకెన జగడంబు సేయు డాల్
పగడంపు సోగకంబముల మీద
నిగుడంబుజమువంటి నిగనిగ విడికెంపు
పువ్వులు పచ్చరాబోదెనూదు
పోడిమగరాచందుకొడిగ నంటినజాతి
రేజోతి రాగోడ జాజుటాకు
జేకొను హొన్నుకాసియతీఁగె మోడి ప
నుల చిత్రపటముల తళకు వెలసి

  1. చిరత్నప్రభ యత్నాంచిత. పూ. ము. తా.
  2. యైన జాతునికి. తా.
  3. దానాస యై. తా.
  4. కోర. తా.
  5. విలోళంబైన. పూ. ము.