పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

51


ఘోర దురితాబ్ధిఁ దరియింప నేరకున్న
కలుషమానసునకు నాకు [1]2గలిగెఁ దేవ
పుణ్యఖనినైతి శోభనంబులు ఘటిల్లె
గుడిసె పావనమయ్యెఁ గోర్కులు [2]ఫలించె.

47


గీ.

అని సుధారసరూపంబులైన భోజ
నముల [3]దృప్తినిఁ జేసి యో యమివరేణ్య!
వానకాలంబు చరియింప వశము గాదు
నిలువగాఁదగు రెన్నెల్లకొలది యిచట.

48


మ.

నను మీదాసుని వేఱు సేయక మునీంద్రా! నాకు నీకోర్కె యిం
డనుచున్ వెండియు మ్రొక్క నియ్యకొని నెయ్యంబొప్ప గోవిందశ
ర్మను రారమ్మని వైష్ణవాగమకథామర్మార్థ మేసంవిధం
బని బోధింపుచుండెఁ గొన్నినెల లయ్యారణ్యకుం డచ్చటన్.

49


క.

యమిసార్వభౌమ! నాభా
గ్యముకతనన్ డింభకుండనై యుండి[4]యుఁ ద
ద్విమలాగమతత్త్వశ్రవ
ణమనీషాసక్తి మిగుల నామదిణ బొద[5]లన్.

50


సీ.

ఆ మహామహులు నన్నత్యంత దయఁజూపు
చూపులఁజూచి నా చుంచు కేల
దువ్వుచు లేఁజెక్కుదోయి యంటుచు ముద్దు
ముద్దుగాఁ బిలిచి నన్ ముద్దుగొనుచు
తిరుమణిదిద్ధి యిత్తెఱఁగున మిక్కిలి
యాదరింతురుగాని యవలబొమ్మ
టంచు బల్కరు తల్లిపెంచుమోహం బెచ్చ
[6]కాకలి దప్పియు లేకపోగ

  1. గలిగి. తా.
  2. ఘటిల్లె. తా.
  3. దృప్తుని. పూ. ము.
  4. య న. పూ.ము.
  5. లెన్. పూ. ము.
  6. కాకలిదప్పి వే కాపబోగ. తా. నాఁకలి దప్పి లేకాఁపఁబోఁగ. పూ. ము.