పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/128

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

47


ధవళయజ్ఞోపవీతములతేటలు దుకూ
లోత్తరీయద్యుతి [1]నొత్తి కలయ
వెలిదమ్మిరేకుల వికవిక నగు నూర్ధ్వ
పుండ్రంబు నుదుటిపై మురువు జూప
జిలుగు నీర్కావిదోవతిచెఱఁగు చరణ
నఖర ముఖ రమ కాచ్ఛాదనమ్ము గాఁగ
కొదమప్రాయంపు మేనినిగ్గులు కడాని
పొళ్ళ వెదఁజల్ల విప్రుండు పురిఁజరించు.

28


గీ.[2]

 [3]వీటివిటకోటి భ్రమయించు లేటిచూపు
వలపునాడుల గని తలవాంచు నతఁడు
దైవకృత మెట్టిదియొ కాని తరళఁ జూచి
తరళతరచిత్తవృత్తియై తత్తరించు.

29


క.

ఏచిన మోహము [4]చే నతఁ
డాచెలిచెలువంబుఁ దలఁచి [5]యాచరితత్ర
య్యాచారనిత్యకృత్యుం
డై చేతోజాతదళల నలజడిఁబడుచున్.

30


క.

మక్కువ తమకము తరితీ
పక్కర నివ్వెరగుగాఁగ [6]నద్భుతము భయం
బెక్కుడు తమి వేగిరపా
టొక్కట రాగమునఁ బోర హోరాహోరిన్.

31


మ.

సిగదువ్వున్ ముడివైచు దువ్వుమఱియుం జేదోయి బిట్టెత్తుచున్
బిగియన్నిక్కుచుఁ బెక్కుచేష్ట లొలయన్ బెట్టావలించు న్నఖా
గ్రగతిం [7]జీరి తటుక్కునన్ బయిఁబడన్ ఘర్మాంబువుల్ జిమ్మచున్
వగగా [8]వగ్గము నుగ్గడించు ఘనరావస్ఫూర్తి కంఠధ్వనిన్.

32
  1. చెంత తా.
  2. ఈపద్యము పూర్వముద్రణమున లేదు.
  3. విటివిటి. తా.
  4. చేతన్ తా.
  5. యాచాత త్రా. తా.
  6. యదుద్దుఁద్భుతమభయం. తా.
  7. జేరి. తా.
  8. నంగము. పూ. ము.