పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/125

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ఘటికాచలమాహాత్మ్యము


సీ.

చేపట్టుచేసి [1]మ్రోల్చివరగల్గి చిగు
రరఁటియాకుల దొన్నియల ఘటించి
నారికేళ [2]ఫలాశనమ్ములు సవరించి
యాకుల నభిఘార మాచ[3]రించి
కఁకణ ఝణఝణత్కారముల్ విలసిల్ల
ఘలుఘల్లురని [4]పదాంగదము లులియ
బంగారు సరిగంచు రంగు [5]సుగ్గడితంపు
తెలిదువ్వటము [6]ఫెళఫెళల నీన
కదలు మెట్టెలకవ తాళగతుల మొరయ
నెయ్యమునఁ గొంగఱతివలందియ్యఁ బదర
కెంతయును దాల్మిమై రమాకాంతచెలువు
నింపుచెలి వగమీఱ వడ్డింపుచుండ.

16


సీ.

తునియ కొండొకటితో పెనగొను కరమాన్న
మొలిచిన పప్పు సద్యోఘృతంబు
కారంపుకూరలు చారులు శాకము
లంబళ్ళు పచ్చళ్ళు నానవాలు
వరుగు లప్పడములు వడియముల్ తేనియ
పాకముల్ [7]సిగరలు పాయసములు
కలవంటకములు బజ్జులు పిండివంటలు
చక్కెరజున్నురసాయనములు
పాలు ఫలములు నెడనీళ్ళు పానకములు
నూరుబిం డ్లూరుగాయలు తైరు శొంఠి
[8]పాంసులవణమ్ము జంబీరఫలరసములు
నించఁ దగు నీరుమో రారగించి లేచి.

17
  1. మ్రొల్చివర. తా. మేల్చివర. పూ. ము.
  2. కలాపనమ్ములు. తా.
  3. రింప. తా.
  4. పదాంగములు నిలిపి. తా.
  5. సుంగడితపు తా. నంగడితపు పూ.ము.
  6. బెళబెళల.
  7. శిఖిరలు. తా.
  8. పాంసులవణాంశభంజల ఫలరసముల. తా. పాంసులవణశుభోజ్వల ఫలరసముల. పూ.