పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35


సకల [1]సత్వపురాణసారాంశముల హెచ్చు
కైవల్యరమఁ [2]బ్రీతికలువవచ్చు
విష్ణుస్థలమణుల వెల [3]దీర్చు బలుబచ్చు
శ్రీలతాంగి వసించు మేలుమచ్చు
సాధుసమాగమజ్ఞానవిద్యకు నచ్చు
వివిధజన్మార్థముల్ వెరఁజు ముచ్చు
సనక జనకాది సురవర [4]చయము మెచ్చు
విపులతర నవవిధభక్తి [5]వెదకవచ్చు
పుణ్యసౌధవితానంబుపూలకుచ్చు
వినుము దానిమహత్త్వమెంతనఁగవచ్చు.

78


క.

కావున విను ధన్యులకు ర
మావరచరణాబ్దభక్తి [6]మలయున్ వెలయున్
శ్రీవైభవంబు నఘము
ద్రావిద్రావణవిధాయి ధర్మస్పృహయున్.

79


సీ.

[7]ఆరామనామ జపామోదమేదుర
హృదయారవిందులై పొదలువారి
శౌరి కథాసుధాసారంబు తోరంబు
గా వీనుదోయిళ్ళఁ ద్రావువారి
పద్మారమణపాద పద్మార్హణాశస్త
హస్తారవిందులై యలరువారి
తీర్థపాదపదాబ్జతీర్థసం[8]సేవన
మున పావనాంగులై తనరువారి
వారిజోదరచిహ్నముల్ వరలువారి
ధీరమతులై ముకుందుఁ గీర్తించువారి
దూరమునఁజూచి పరువెత్తు దురిత[9]మతులఁ
గెడపు [10]కాసరవాహను కింకరాళి.

80
  1. సత్య. పూ. ము.
  2. నెతికల్వవచ్చు. తా.
  3. దీర్ప. తా.
  4. శయము. పూ. ము. తా.
  5. వేదిగ. తా.
  6. మరయన్. పూ. ము.
  7. శ్రీ. తా.
  8. సేచన. పూ.ము. సంచనమున. తా.
  9. వతుల; తా.
  10. కాసార. పూ.ము. తా.